back

జులై 6 న మెగా పోటీ..!



Share via:

మెగా ఫ్యామిలీ హీరోల నెంబర్ పెరిగిపాయింది. ఇప్పుడు ఎవరు ఎ సినిమా తీస్తున్నారు, అవి ఎప్పుడు రిలీజ్ అవుతాయి, వాటి పేర్లేంటి అని గుర్తు పెట్టుకోవడం కూడా కష్టం ఐపోయింది. ఒకే టైం లో ఇద్దరు మెగా హీరోల సినిమాలు రిలీజ్ అవ్వకుండా చూసుకోవడం కూడా కష్టమే, ఎందుకంటే ఏ నిర్మాతైనే మంచి వీకెండ్ నే తన రిలీజ్ అవ్వాలని కోరుకుంటారు. ఇలాగే ఫిబ్రవరి లో వరుణ్ తేజ్ ‘తొలిప్రేమ’ - సాయి ధరం తేజ్ ‘ఇంటెలిజెంట్’ ఒక రోజు గ్యాప్ లో రిలీజ్ అవ్వగా తొలిప్రేమ విజయం సాధించింది.

ఇప్పుడు మరోసారి ఇద్దరు మెగా హీరోలు పోటీపడుతున్నారు. సాయిధరమ్ తేజ్ నటించిన తేజ్ ఐ లవ్ యు సినిమాను జులై 6న విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. ఇక చిరంజీవి చిన్నల్లుడు కల్యాణ్ దేవ్ హీరోగా పరిచయం అవుతున్న విజేత సినిమాను కూడా జులై 6నే విడుదల చేస్తున్నారు. ఇది ఆ సినిమా నిర్మాత సాయికొర్రపాటికి సెంటిమెంట్ డేట్, అదే రోజు ఈగ సినిమా విడుదలై సూపర్ హిట్ అయింది. మరి జులై 6పోటీలో రెండు సినిమాలు గెలవాలని కోరుకుందాం.

Tags : Tej I Love U, Vijetha, Kalyaan Dhev, Sai Dharam Tej, July 6th

Write a comment ...
Post comment
Cancel