back

వైష్ణవ్ తేజ్ కి విలన్ గా తమిళ్ స్టార్ హీరో



Share via:

మెగా మేనల్లుడు సైధారం తేజ్ కి తమ్ముడు అయిన వైష్ణవ్ తేజ్ సినిమా షూటింగ్ ప్రారంబమైన విషయం తెలిసిందే. నూతన దర్శకుడు బుచ్చిబాబు సానా దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.


వాస్తవిక ప్రేమ కథ ఆధారంగా తెరకెక్కబోతున్న ఈ చిత్రం బెస్తవాళ్ల బ్యాక్ డ్రాప్ లో ఉంటుందని తెలుస్తోంది. ఇందులో వైష్ణవ్ తేజ్ పైన రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ ని బట్టి ఇందులో హీరో జాలరిగా నటిస్తున్నాడని అర్థమవుతుంది. ఇక ఇందులో విలన్ రోల్ చాలా పవర్ఫుల్ గా ఉంటుందట. ఆ రోల్ లో తమిళ్ హీరో కం విలన్ విజయ్ సేతుపతి నటిస్తోన్నట్లు తెలుస్తోంది. విలక్షణ నటుడు విజయ్ సేతుపతి ఇప్పటికే సైరా లో చిరంజీవి పక్కన కుడి భుజంగ ఒక ముఖ్య పాత్రతో తెలుగు సినిమా పరిశ్రమలోకి ప్రవేశించాడు. ఇక ఇప్పుడు ఈ సినిమాలో తన నటనతో తెలుగు ప్రేక్షకులను కూడా మైమరుపించుట కాయం .

ఈ చిత్రానికి ‘రాక్ స్టార్’ దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకి సంగీతం అందిస్తుండగా, శ్యామ్ దత్ సినిమాటోగ్రఫీ బాధ్యతలను నిర్వహించనున్నారు. అలాగే ‘రంగస్థలం’ ఫేమ్ రామకృష్ణ మౌనిక ఆర్ట్ డిపార్ట్ మెంట్ ను చూసుకుంటుండగా… నవీన్ నూలి ఎడిటర్ గా చేస్తున్నారు.

Tags : Vaishnav Tej, Vijay Sethupathi

Write a comment ...
Post comment
Cancel