back

సైరా లో తమన్నా...!



Share via:

ఖైదీ నెంబర్ 150 తో చాలా గ్రాండ్ గా తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ ఇప్పుడు 'సై రా నరసింహ రెడ్డి' అనే బయోపిక్ తీస్తున్న విషయం తెలిసిందే. భారీ బడ్జెట్ తో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రాన్ని చిరి తనయుడు రాంచరణ్ నిర్మాతగా సురేందర్ రెడ్డి తీస్తున్నాడు. ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి ఒక కొత్త వార్త బయటికి వచ్చింది, అదేంటంటే టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నా ఈ సినిమాలో ఒక ముఖ్య పాత్ర లో నటిస్తుంది అని. ఇప్పటికే బాహుబలి సినిమాలో నటించి అందరిని మెప్పించడమే కాక ఇలాంటి సినిమాల్లో నటించగల సత్తా తనకి ఉందని తమన్నా నిరూపించింది.

ఇప్పటికే అన్ని ముఖ్య భాషల నటీనటులతో నిండిపోయిన సైరా సినిమాలో ఇంకెంత మంది ప్రముఖ నటులు చేరతారో అని సిని అభిమానులు చర్చించుకుంటున్నారు.

Tags : Tamanna in Syeraa Narasimha Reddy, Syeraa Narasimha Reddy New Cast, Sye Raa Narasimha Reddy New Updates, Megastar Chiranjeevi

Write a comment ...
Post comment
Cancel

Send Your Fan moments, Events, Association Details