back

బీదర్ నుంచి కోకాపేట్ కి మారిన ‘సైరా’ షూటింగ్ ..



Share via:

నిన్న కర్ణాటక లోని బీదర్ లో జరగాల్సిన ‘సైరా’ సినిమా షూటింగ్ కొందరి గొడవ వల్ల రద్దైన విషయం తెలిసిందే. అన్ని అనుమతులు ఉన్నా కూడా స్థానికులు చేసిన గొడవకి అక్కడ వేసిన చిన్న సెట్ ని వదిలేసి వచ్చేసిన సైరా టీం, ఇప్పుడు హైదరాబాద్ శివారు లోని కోకాపేటలో వేసిన భారీ సెట్ లోకి వచ్చేసింది. బీదర్ లో తీయాల్సిన సన్నివేశాలను ఇంకో చోట తరువాత తీయచ్చని , ఈ లోపల కోకాపేట్ సెట్లో కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను పూర్తి చేయాలని నిర్ణయించారు.

ఇక ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, సుదీప్, జగపతిబాబు, విజయ్ సేతుపతి లాంటి భారీ తారాగణం నటిస్తోన్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో నయనతార కథానాయికగా నటిస్తుంది. బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అమిత్ త్రివేదీ ఈ చిత్రానికి మ్యూజిక్ ను అందిస్తున్నారు. భారీ బడ్జెట్ తో హీరో రామ్ చరణ్ ఈ చిత్రాన్ని సురేందర్రెడ్డి దర్శకత్వంలో నిర్మిస్తున్నారు.

Tags : Syeraa Narasimha Reddy, Chiranjeevi, Megastar

Write a comment ...
Post comment
Cancel