back

చౌటుప్పల్ దగ్గర ‘సైరా’ షూటింగ్ ..!



Share via:

శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న సైరా సినిమా షూటింగ్, ఇప్పుడు కీలక ఘట్టాల చిత్రీకరణలో ఉంది. ఇందులో భాగంగా ముఖ్యపాత్రదారులు మెగాస్టార్ చిరంజీవి, నయనతార, విజయ సేతుపతి, జగపతి బాబు మొదలగు వాళ్ళందరు పాల్గొనే కొన్ని సన్నివేశాలు మరియు ఒక పాత చిత్రీకరణ కోసం సినిమా యూనిట్ ఈ వారాంతానికి చౌటుప్పల్ వెళ్లనుంది.


చౌటుప్పల్ మండలం దండుమల్కాపురం శివారుల్లోని ఘాట్ కంచె భూముల్లో భారీ దేవాలయ సెట్టింగ్ వేశారు, అక్కడే ఒక వారం పాటు చిత్రీకరణ జరగునుందని చిత్ర వర్గాలు తెలియచేశాయి. ఇక్కడ షూటింగ్ పూర్తి అవ్వగానే రామోజీ ఫిలిం సిటీ లో వేసిన విలేజ్ సెట్ లో తర్వాతి షెడ్యూల్ ప్లాన్ చేసారు.

చిరంజీవి - కొరటాల శివ సినిమాకి ముహూర్తం ఖరారు ..

రాంచరణ్ నిర్మాతగా సురేందర్రెడ్డి దర్శకతవంలో 200కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా రిలీజ్ ఎప్పుడు అనేది ఇంకా ఖరారు అవ్వలేదు, ఫిలిం నగర్ కథనం ప్రకారం ఈ ఆగష్టు 15 కి ఈ సినిమా విడుదల చేయాలని ఒక సూత్రప్రాయ అంగీకారానికి వచ్చినట్లు తెలుస్తుంది.

Tags : Chiranjeevi, Syeraa, Ram Charan

Write a comment ...
Post comment
Cancel