back

బీదర్ లో సైరా షూటింగ్ ని అడ్డుకున్న స్థానికులు...



Share via:

తొలి తరం స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డిజీవిత కథ ఆధారంగా మెగాస్టార్ చిరంజీవి నరసింహారెడ్డి పాత్రలో చేస్తున్న సినిమా ‘సైరా’. నిర్మాత రాంచరణ్ ఇచ్చిన స్వేచ్చతో దర్శకుడు సురేందర్ రెడ్డి ఖర్చుకు వెనకాడకుండా చిన్న సీన్ ను కూడా రిచ్ గా తీసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. తాజాగా సినిమాకు సంబంధించిన ఒక సీన్ ను బీదర్ లోని కోటలో చిత్రీకరించేందుకు ప్లాన్ చేశాడు. అక్కడ వారం నుండి పది రోజుల పాటు చిత్రీకరణకు అన్ని ఏర్పాట్లు జరిగాయి. అక్కడి అధికారుల నుండి పర్మిషన్ కూడా తీసుకోవడం జరిగింది.


అయితే తాజాగా చిరంజీవితో పాటు చిత్ర యూనిట్ సభ్యులు అంతా కూడా అక్కడకు చేరుకొని షూటింగ్ మొదలు అయిన వెంటనే స్థానిక ముస్లిం యువకులు అక్కడకు చేరుకుని షూటింగ్ ను అడ్డుకున్నారు . తెలిసిన వార్తల ప్రకారం పురావస్తు శాఖ ఆధ్వర్యంలోని బీదర్ లోని బహమనియుల కోటలో ఇప్పటికీ ముస్లింలు పర్వదినాల్లో ప్రార్థనలు చేస్తుంటారు, సైరా షూటింగ్ లో భాగంగా హిందూ దేవుల ప్రతిమలను పెట్టినారు అనే అభియోగంతో షూటింగ్ ని అడ్డుకున్నట్లు తెలుస్తుంది.

అయితే అక్కడ ఇంతకు మునుపు కూడా సినిమా షూటింగ్ లు జరిగాయని, అప్పుదేప్పుడు కనపడని వాళ్ళు ఇప్పుడే రావడం ఏదో ప్లాన్ ప్రకారం జరుగుతుందని కొందఱు ఆ ప్రాంతంలోని వ్యాపారులు చెబుతున్నారు. ఏది ఏమైనా పోలీసులు వచ్చి ఆ షూటింగ్ నిలిపేసి అందరిని పంపించేసారు. ఇక రాంచరణ్ కి ఈ మొత్తం ఏర్పాట్లకి అయిన ఖర్చు అంతా వేస్ట్ అయినట్లే.

Tags : Syeraa Shooting, Bidar, Ram charan, Surender Reddy

Write a comment ...
Post comment
Cancel