back

రేపే సై కొట్టనున్న చిరంజీవి...Share via:

రాంచరణ్ నిర్మాణంలో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మకమైన సినిమా సై రా నరసింహారెడ్డి.. దాదాపు 200 కోట్ల బడ్జెట్తో నిర్మితమవుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంతో జరుగుతుంది. భారీ తారాగణంతో ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధులైన టెక్నీషియన్స్ తో నిర్మితమవుతున్న ఈ సినిమా 2019 వేసవి లో 4 భాషలలో విడుదలవుతుంది

ఈ సినిమా గురించి వచ్చే ప్రతి వార్తను ఆసక్తిగా చూస్తున్న సినీ అభిమానులకు రేపు పండగే అని చెప్పాలి.. చిరంజీవి జన్మదినం సందర్భంగా రేపు ఉదయం 11.30 గంటలకు ఈ సినిమా టీజర్ రిలీజ్ చేయబోతున్నారు. మాముల్గానే మెగా అభిమానులకు చిరంజీవి పుట్టినరోజు అంటే ఒక పండగ అలాంటిది అదే రోజు టీజర్ రిలీజ్ అంటే అది ఇంకా పండగకే పండగ లాంటిది.

ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్ పోస్టర్ అంచనాలను పెంచేసింది. మరి రేపు టీజర్ ఎలా ఉంటుంది అనేది వేచి చూడాల్సిందే...

Tags : Megastar Chiranjeevi, Syeraa Narasimha Reddy Teaser Release on August 21st

Write a comment ...
Post comment
Cancel