back

2019 వేసవికి రానున్న సైరా....



Share via:

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సైరా నరసింహారెడ్డి సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. కొణిదల ప్రొడక్షన్ బ్యానర్‌పై రామ్ చరణ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ భారీ బడ్జెట్ సినిమా సురేందర్ రెడ్డి డైరెక్షన్‌లో తెరకెక్కుతోంది. ఈ నెల 7వ తేది నుంచి హైదరాబాద్ గోల్కొండ శివార్లులో మరియు రామోజీ ఫిలిం సిటీ లో వేసిన సెట్టింగ్లో 45 రోజుల పాటు యుద్ధ సన్నివేశాలు చిత్రీకరించనున్నారు.

ఇదే వేగంతో అక్టోబర్ కంతా ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని సంక్రాంతి కి రిలీజ్ చేయాలి అనుకున్నారు. కానీ గ్రాఫిక్స్ వర్క్ ఎక్కువ ఉండడం అలాగే దేశమంతా 4 భాషల్లో రిలీజ్ చేయాలి అనుకోవడంతో రిలీజ్ డేట్ లో మార్పు జరుగుతున్నది. బాహుబలి, రంగస్థలం సినిమాల తరహాలోనే వేసవికి తొలి భారీ సినిమాగా దీన్నే రిలీజ్ చేయాలని అనుకుంటున్నారట. అందులో దేసవ్యాప్తంగా వేసవి సెలవులు అనేది ఈ సినిమాకి ప్లస్ అవుతుందని కుడా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. మరి వచ్చే వేసవి కి 'సైర సైర' అనడానికి అభిమానులంతా సిద్ధం అయిపోవాలి.

Tags : Syeraa Narasimha Reddy Movie Release, Megastar Chiranjeevi, Nayanthara, Amitabh Bachchan, Sudeep, Chiru, Surender Reddy

Write a comment ...
Post comment
Cancel