back

సైరా ఫస్ట్ లుక్ ఎప్పుడంటే ..?



Share via:

ఖైదీ నంబర్ 150తో మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ అదిరిపోయింది. తన తర్వాతి సినిమాగా స్వాతంత్ర్య సమర యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథతో ‘సైరా నరసింహారెడ్డి’కి శ్రీకారం చుట్టాడు. ఎన్నో ఏళ్లుగా నానుతున్న ఈ ప్రాజెక్టు ఎట్టకేలకు గత ఏడాది పట్టాలెక్కింది. వివిధ కారణాల వల్ల షెడ్యూళ్లు ఆలస్యమవుతున్నా కూడా చిత్ర బృందమేమీ హడావుడి పడటం లేదు. చిరు కెరీర్ కే తలమానికంగా ఈ ప్రాజెక్టును నిలబెట్టాలన్న లక్ష్యంతో హడావుడి లేకుండా షూటింగ్ కానిస్తున్నారు. ఈ రోజు నుంచి 45 రోజుల అతి పెద్ద షెడ్యూల్ ప్రారంభం అవుతున్నది. సినిమాలోని ముఖ్యమైన పోరాట సన్నివేశాలను ఈ షెడ్యూల్ లో తెరకెక్కించనున్నారు.

ఇక ఈ చిత్ర ఫస్ట్ లుక్ ఎప్పుడు రిలీజ్ చేయాలనే విషయంలో నిర్మాత రామ్ చరణ్ ఒక నిర్ణయానికి వచ్చేసినట్లు సమాచారం. ఆగస్టు 22న మెగాస్టార్ పుట్టిన రోజు కానుకగా అభిమానులను మురిపించేసే ఒక బ్రహ్మాండమైన ఫస్ట్ లుక్ రిలీజ్ చేయాలని భావిస్తున్నారట. చిరు పుట్టిన రోజుకు అభిమానులు ఇలాంటి కానుకే కోరుకుంటారు. ఈ ఫస్ట్ లుక్ కి సంభందించిన పని అప్పుడే మొదులైంది కుడా...

Tags : Syeraa Narasimha Reddy First Look Release Date, Megastar Chiranjeevi

Write a comment ...
Post comment
Cancel