back

సైరాలో ఎన్ని పాటలో తెలుసా ...?



Share via:

RRR లో మూడు పాటలే ఉన్నాయన్న విషయం బయటకు వచ్చిన సంగతి తెలిసిందే . మరి అక్టోబర్ 2 వ తేదీ న విడుదల కాబోతున్న సైరా సినిమా లో కూడా మూడే పాటలు వుంటాయని తెలుస్తోంది . సైరా..సై సైరా అన్న టైటిల్ సాంగ్ టైటిల్స్ వస్తున్నపుడే అయిపోతుందట. అందువల్ల మిగిలినవి ఇక రెండు పాటలే. అందులో ఒకటి డ్రమ్స్ సాంగ్. ఇంద్ర సినిమాలోని ఘల్లు ఘల్లుమని...అనే పాట టైపులో భారీగా జనాలతో చిత్రీకరించారు ఈ పాటను. ఇక రెండో పాట హీరోయిన్ తమన్నా మీద చిత్రీకరించారు. ఈ రెండు పాటలే కీలకం. అయితే రెండు పాటలు బాగున్నాయని, అందులో తమన్నా మీద చిత్రీకరించిన పాట హైలైట్ అని తెలుస్తోంది. మొత్తం మీద ఇవే పాటలు.

Tags : Syeraa, Megastar Chiranjeevi, Ramcharan

Write a comment ...
Post comment
Cancel