back

‘సైరా’ మెగా మల్టిస్టారర్ అవుతోందా ...



Share via:

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న మొదటి తరం స్వాతంత్ర సమర యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బయోపిక్ “సైరా నరసింహారెడ్డి”. ఈ సినిమాలో ఇప్పటికే భారీగా నటినటులు నటిస్తుండగా ఇప్పుడు ఒక కొత్త వార్త బయటికి వచ్చింది, అదేంటంటే ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలకు వాయిస్ ఓవర్‌ను బన్నీతో చెప్పిస్తారని తెలుస్తోంది.

మెగాస్టార్ హీరోగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మాతగా, నాగబాబు మరియు నిహారికలు ముఖ్య పాత్రలు చేస్తుండగా ఇక స్టైలిష్ స్టార్ గొంతును ఇవ్వడం అంటే.... ఇది ఒక మెగా ఫ్యామిలీ మల్టిస్టారర్ లాగ అవుతుంది.

సైరా సినిమా షూటింగ్ హైదరాబాద్ లో వేసిన భారీ సెట్స్ లో జరుపుకుంటుంది, ఇప్పటికే 80% శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా జనవరి కల్లా షూటింగ్ కి టాటా చెప్పేసి విజువల్ ఎఫెక్ట్స్ పనికి షిఫ్ట్ అవ్వాలని సినిమా యూనిట్ ప్లాన్ చేస్తుంది. మరి సమ్మర్ కి రిలీజ్ చేయాలంటే ఆ మాత్రం ప్లానింగ్ ఉండాల్సిందే ..!

Tags : Syeraa Narasimha Reddy, Megastar Chiranjeevi, Allu Arjun

Write a comment ...
Post comment
Cancel