back

పల్లెకు పయనవుతున్న సైరా ...!



Share via:

సైరా నరసింహారెడ్డి రాంచరణ్ నిర్మాతగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో నరసింహారెడ్డి పాత్రలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సైరా నరసింహారెడ్డి సినిమా ఆకరి దశకు చేరుకుంటుంది. ఇప్పటికే హైదరాబాద్ లో సెట్స్ లో, తరువాత జార్జియా లో భారీ యుద్ధ సన్నివేశాలు, మళ్ళి మైసూరు మరియు బదాని లలో చారిత్రక ప్రదేశాల్లో షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా ఇక పల్లె వాతావరణంలోకి వెళ్లనుంది.


సినిమాలోని అన్ని ముఖ్య పాత్రలు ఉండే సన్నివేశాల చిత్రీకరణ కోసం ఇప్పటికే రామోజీ ఫిలిం సిటీలో రాయలసీమ వాతావరణాన్ని ప్రతిబింబించేలా ఉండే ఓ సహజమైన పల్లెటూరి సెట్ ని ఆర్ట్ డైరెక్టర్ రాజీవన్ సిద్ధం చేసారు. ఇందులో సంక్రాంతి తరువాత నుంచి చిత్రీకరణ ఉంటుందన్న సమాచారం. ఈ షెడ్యూల్ తో టాకీ పార్ట్ మొత్తం అయిపోవచ్చు అంటున్నారు. ఇక పాటలు మరియు మిగతా సన్నివేశాలు మార్చ్ లోపల ఐపోచేసి ఆగష్టు 15 విడుదలకి సినిమాని సిద్ధం చేయాలని అనుకుంటున్నారు.

Tags : Syera, Syera Shoot, Chiranjeevi

Write a comment ...
Post comment
Cancel