back

‘సైరా’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్ ఎప్పుడంటే ...?



Share via:

మెగా స్టార్ చిరంజీవి నటించిన ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి జీవితకథ ఆధారంగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన చారిత్రాత్మక చిత్రం ‘సైరా... నరసింహారెడ్డి’ నిజానికి, హైదరాబాద్‌ ఎల్‌బి స్టేడియంలో ఈ నెల 18న ప్రీ రిలీజ్‌ వేడుక నిర్వహించాలనుకున్నారు.

అయితే... వర్షాల కారణంగా ప్రీ రిలీజ్‌ను వాయిదా వేశారు. ఈ నెల 22న నిర్వహించాలని నిర్ణయించారు. ప్రీ రిలీజ్‌ వేడుకకు తెలంగాణ మంత్రి కేటీఆర్‌, చిరంజీవి సోదరుడు, జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌, దర్శకులు రాజమౌళి, కొరటాల శివ, ఇతర మెగా ఫ్యామిలీ హీరోలు హాజరు కానున్నారు. సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ శ్రీమతి సురేఖ సమర్పణలో రామ్‌చరణ్‌ నిర్మించిన ఈ చిత్రానికి సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి, స్వరాలు: అమిత్‌ త్రివేది.

Tags : Syera, Chiranjeevi, Pre release event.

Write a comment ...
Post comment
Cancel