back

సైరా లోని మరో దృశ్యాన్ని...పోస్ట్ చేసిన అమితాబ్ బచ్చన్



Share via:

ఎప్పుడు..ఎప్పుడంటూ ప్రేక్షకులు ఎదురు చేస్తున్న..మన మెగా స్టార్ నెక్స్ట్ సినిమా సైర నరసింహ రెడ్డి శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది... "సైరా" ఉయ్యాలవాడ నరసింహారెడ్డిగా మెగా స్టార్ చిరంజీవి నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్ర రాజం.ఈ చిత్రం లో అమితాబ్ బచ్చన్ ఒక కీలక పాత్రా పోషిస్తున్న విషయం అందరికి తెలిసిందే.

అమితాబ్ బచ్చన్ తన లుక్ కు సంబంధించి ఈ మధ్య ఒక స్టిల్ ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు కూడా .అయితే మళ్ళి మరో పిక్ కూడా నిన్న తన బ్లాగ్ లో పెట్టి మరో ట్విస్ట్ ఇచ్చాడు అమితాబ్.అయితే ఇలా చేయడం వలన ఇన్నాళ్లూ రహస్యంగా ఉంచిన చిరంజీవి రూపం బయటకొచ్చింది.

సైరా సినిమా కోసం చిరంజీవి ప్రత్యేకంగా ముస్తాబయ్యారని, అతడి సినిమా రూపం సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా ఉంటుందని చెప్పుకొచ్చారు అమితాబ్ . ఆ చిరంజీవి లుక్ ఎలా ఉంటుందో? తాజాగా విడుదలైన స్టిల్స్ లో తెలిసిపోయింది. జులపాల జట్టు, మీసం, గడ్డంతో ఒక మహరాజు రూపంలో చాల హుందాగా కనిపించారు చిరంజీవి గారు. నిన్నటితో అమితాబ్ బచ్చన్ కు సంబంధించిన షూటింగ్ భాగం పూర్తయింది..అయితే ఇంకో రెండు రోజుల డేట్స్ కావాలంటూ డైరెక్టర్ అడిగినట్టు సమాచారం.

Tags : syeraa chiru getup,amithab,chiranjeevi,syeraa narsimhareddy,chiru look in syeraa,new look syeraa,chiru nayanatara,

Write a comment ...
Post comment
Cancel