back

సైరా హడావుడి స్టార్ట్ అవుతోంది.



Share via:

మెగాస్టార్ మెగా మూవీ సైరా సినిమా సుమారు మరో ఇరవై రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటి వరకు ఖరారు అయిన ప్రచారం షెడ్యూలు ఎలా వుందీ అంటే, కర్నూలులో భారీ బహిరంగ ఫంక్షన్. కానీ డేట్ ఫిక్స్ కాలేదు. బాలీవుడ్ బాద్ షా అమితాబ్ రావడం లేదు. ఈ మేరకు వస్తున్న వార్తలు కరెక్ట్ కాదు. మెగా హీరోలు అంతా మాత్రం హాజరయ్యే అవకాశం వుంది.

దీని తరువాత కర్ణాటక రాజధాని బంగళూరులో కూడా భారీ పబ్లిక్ ఫంక్షన్ వుంది. అక్కడి హీరో సుదీప్ ఫ్యాన్స్ కోసం, అక్కడ వున్న మెగా ఫ్యాన్స్ కోసం ఇది ఏర్పాటు చేస్తున్నారు. చెన్నయ్ లో మాత్రం ప్రెస్ మీట్ మాత్రమే వుంటుంది. ఇవన్నీ ఇలావుంచితే కీలకమైన సినిమా ట్రయిలర్ ను మాత్రం ఆన్ లైన్ లోకి వదిలేయడం లేదు.

కర్నూలు ఫంక్షన్ లోనే విడుదల చేస్తారు. కానీ అంతకు ముందే అంటే రాబోయే నాలుగు రోజుల్లోనే సైరా టైటిల్ సాంగ్ ను విడుదల చేస్తారు. సైరా నరసింహారెడ్డీ.. సై సైరా అంటూ సాగే ఈసాంగ్ మాంచి ఊపుతో సాగుతుందని తెలుస్తోంది. ఈ పాటకు ట్యూన్, వాయిస్, లిరిక్స్ అన్నీ అలాగే సెట్ అయ్యాయి. రచయిత సిరివెన్నెల అత్యద్భుతంగా రాసిన ఈ పాటను ముందుగా విడుదల చేస్తారు. సుమారు అయిదున్నర నిమషాలు వుంటుందీ పాట.

ఒక విధంగా చెప్పాలంటే ఈ పాటతోటే సైరా హల్ చల్ స్టార్ట్ అవుతుంది.

Tags : Chiranjeevi, Ramcharan, Syera

Write a comment ...
Post comment
Cancel