back

సినిమా ఎలా ఉంటుందో చెప్పేసిన సైరా టీజర్.....



Share via:

ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం 'సైరా' నరసింహారెడ్డి టీజర్ కాసేపటి క్రితం రేపటి చిరంజీవి పుట్టినరోజు సందర్బంగా విడుదల చేసారు. ఈ కార్యక్రమంలో నిర్మాతలు సురేఖ గారు, రాంచరణ్, చిరంజీవి తల్లి అంజనాదేవి గారు, డైరెక్టర్ సురేందర్ రెడ్డి తో పాటు సినిమా యూనిట్ పాల్గోనింది.

టీజర్ మొదలవగానే టాప్ ఆంగిల్ నుంచి బ్రిటిష్ కోట, ఆ తర్వాత గుర్రపు బగ్గీ నుండి దిగుతున్న ఒక బ్రిటిష్ ఆఫీసర్ ఫుట్ బోర్డు లాగా ఒక భారతీయుడి వీపుపై కాలు పెట్టి దిగడం చూపించారు. తర్వాత మోబ్బులతో కమ్ముకున్న ఆకాశం అందులో మెరుపులా ముందట తన బురుజు పైన జెండా పట్టుకుని బ్రిటిష్ సైన్యం కోసం ఎదురుచూస్తున్న ఒక కొదమసింహం లా మెగాస్టార్ చిరంజీవి నిలబడి ఉండడం చూసే కళ్ళకి 1800 లలోని జమిందారు కళ్ళెదుట కనిపించినట్లే.

ఈ యుద్ధం ఎవరిదీ? అంటూ చిరు పెద్దగా అడిగితే వెంటనే అక్కడ జనాలు అందరూ 'మనదీ' అంటూ ఒకేసారి చెప్పడం, 'నరషింహా రెడ్డీ' అంటూ ఒక బ్రిటిష్ వాడు వాడి అరవడం.. చిరు చెట్లలోనుంచి గుర్రపు స్వారీ చేస్తూ బయటకు వచ్చి కత్తి బ్రిటిష్ వాళ్ళపై దూయడం అన్ని ఒక దృశ్య అద్భుతం మనం చూడబోతున్నాం అనే ఫీలింగ్ కలిగిస్తాయి. ఇక ఆఖరిగా చిరంజీవి తన గుర్రం ముందు కాళ్ళని అంతెత్తున పైకి లేపే స్టంట్ చెప్పకనే చెప్తుంది ఈ సినిమా ఎలా ఉండబోతుందో...

టీజర్ హైలైట్స్ ..

ఒకటే నిరాశ ఏంటంటే టీజర్ లో పవర్ఫుల్ డయలాగ్ లేకపోవడం, కాని ఈ టీజర్ చిరంజీవి పుట్టినరోజు సందర్బంగా రాంచరణ్ మెగా అభిమానులకు ఇచ్చిన గొప్ప గిఫ్ట్ అనే చెప్పుకోవచ్చు. మరి ఇక 2019 సమ్మర్ వరకు వెయిట్ చేయడం ఎలాగో......

Tags : Syeraa Narasimha Reddy Teaser Review, Megastar Chiranjeevi, Ram Charan

Write a comment ...
Post comment
Cancel