back

మరో భారీ షెడ్యూల్ కి సిద్ధమైన సైరా ..



Share via:

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సైరా నరసింహారెడ్డి చిత్ర యూనిట్ తమ తదుపరి భారీ షెడ్యూల్ కి సిద్ధమవుతుంది. ఇటివల ఈ చిత్ర యూనిట్ మూవీ క్లైమాక్స్ షూట్ నిమిత్తం జార్జియా వెళ్ళిన సంగతి తెలిసిందే. అయితే దసరా ముంది ఆ షెడ్యూల్ పూర్తయి చిత్ర బృందం ఇండియాకి తిరిగొచ్చిన విషయం తెలిసిందే.

ఇప్పుడు రెండు వారాల గ్యాప్ తర్వాత హైదరాబాద్ లో వేసిన భారీ సెట్స్ లో ఒక భారీ షెడ్యూల్ ప్లాన్ చేసినల్టు తెలిసింది. 70% టాకీ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఇప్పుడు జరగబొఎ షెడ్యూల్ తో మొత్తం టాకీ పూర్తి చేయాలనే టార్గెట్ పనిచేస్తున్నారు. డిసెంబర్ చివరి కల్లా షూటింగ్ పూర్తి చేసుకుని వేసవి కాలంలో రిలీజ్ కి ప్లాన్ చేస్తున్న ఈ సినిమా అన్ని అనుకున్నట్లు జరిగితే 2019 మే లో భారత దేశ సినీ ప్రపంచంలో మరో అధ్బుతం సృష్టించవచ్చు.

Tags : Sye Raa Narasimha Reddy, Megastar Chiranjeevi

Write a comment ...
Post comment
Cancel