back

హైదరాబాద్ కి వచ్చేస్తున్న సైరా టీం ...



Share via:

గత నెల రోజులగా జార్జియాలో భారీ యుద్ధ సన్నివేశాల చిత్రీకరణలో ఉన్న మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సైరా సినిమా యూనిట్ ఇప్పుడు హైదరాబాద్ కి తిరిగి వస్తుంది. ఒక వైపు సినిమా యూనిట్ అంతా జార్జియాలో ఉండగా ఇక్క హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీ లో భారీ సెట్టింగ్స్ రెడీ ఐపోయాయంట...

నవంబర్ నెల అంతా కొత్తగా వేసిన సెట్లలో షూటింగ్ ప్లాన్ చేసాడంట దర్శకుడు సురేందర్ రెడ్డి. దీనితో 90 శాతం సినిమా పూర్తవుతుంది అంటున్నారు. మిగతా షూటింగ్ డిసెంబర్ లోపల పూర్తి చేస్తే, ఇప్పటికే మొదలైన గ్రాఫిక్స్ కూడా ఫిబ్రవరి చివరి కల్ల పూర్తి చేసేయాలని నిర్మాత రాంచరణ్ టైం ఫిక్స్ చేసాడంట. మరి అన్ని అనుకున్నట్లే జరిగి 200 కోట్ల మన తెలుగు స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బయోపిక్ 2019 సమ్మర్ కి రిలీజ్ అయితే ఇక సినీ అభిమానులకు పండగే....

Tags : Sye Raa Narasimha Reddy, Megastar Chiranjeevi, Hyderabad

Write a comment ...
Post comment
Cancel