back

సైరా సినిమా సుశ్మితకు కత్తి మీద సామే...



Share via:

చిరంజీవి పెద్ద కూతురుగా సుశ్మిత అందరికీ తెలుసు. అలాగే ఆ అమ్మాయి చిరంజీవి నటించిన ఖైది నెం .150 సినిమాకు కాస్ట్యూమ్ డిజైనర్ గా చేసి అందహ్రిని ఆకట్టుకుంది. నేషనల్ ఇన్స్టిట్యూట్ అఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (NIFT) లో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు చేసిన సుశ్మిత, తరువాత చిరంజీవి నటించిన డాడి, ఇంద్ర సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్ అసిస్టెంట్ గా పనిచేసింది. పెళ్లి, తరువాత పిల్లలు కారణంతో చాల కాలం పాటు తనకు ఇష్టమైన ప్రొఫెషన్కి దూరంగా ఉన్న తను తన తండ్రి రీ-ఎంట్రీ సినిమాతో తను పని మళ్ళి మొదలెట్టింది.

నిజానికి సైరాకు ముందు అనుకున్న కాస్ట్యూమ్ డిజైనర్ అంజు మోడీ. బాజీరావు మస్తానీ లాంటి సినిమాలకు పని చేసిన అనుభవంఉండటం తో తనను తీసుకున్నారు. కానీ సీమ స్థితిగతులు చరిత్ర గురించి సరైన అవగాహన లేని కారణంగా అంజు డిజైన్ చేసిన వాటిలో సహజత్వం మిస్ అవుతోందని భావించిన సూరి టీమ్ సుశ్మితకే కబురు పెట్టారట. ఖైది నెం 150 అంతే కమర్షియల్ సినిమా కాబట్టి ట్రెండ్ కు తగ్గట్టు ఆలోచించడం వల్ల చిరు డ్రెస్సులకు మంచి పేరు వచ్చింది. కానీ సైరా 1800 కాలం నటి చరిత్ర దాన్ని శ్రద్ధగా ఆకళింపు చేసుకుని అప్పటి యోధులను ప్రతిబింబించేలా దుస్తులు సమకూర్చాలి. అతి త్వరలో 500 పైగా ఆర్టిస్టులు పాల్గొనే ఓ భారీ యుద్ధ సన్నివేశం చిత్రీకరించాల్సి ఉందట. దానికోసమే సుశ్మిత భారీగా కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. అంజు మోడీని తప్పించిన సరైనదే అని ఋజువు చేయాల్సిన బాధ్యత కూడా సుస్మిత మీద ఉంది. అందుకే ప్రతి చిన్న విషయం మీద అత్యంత శ్రద్ధ వహిస్తున్నట్టు సమాచారం. అంతా బాగానే ఉన్నాకూడా ఎ మాత్రం తేడా వచ్చిన సుశ్మిత కి చాల చెడ్డ పేరు వస్తుంది, అందుకే ఈ పని కత్తి మీద సాము లాంటిది.

Tags : Sye Raa Narasimha Reddy, Sushmitha, Megastar Chiranjeevi

Write a comment ...
Post comment
Cancel