back

సాయి ధరం తేజ్ సినిమాలో సునీల్..!



Share via:

సాయిధరమ్ తేజ్ హీరోగా మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్పై నవీన్ యర్నేని, రవి యర్నేని, మోహన్ చెరుకూరి సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా ‘చిత్రలహరి’. కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి రాక్స్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో సాయి ధరమ్ సరసన కల్యాణి ప్రియదర్శన్ హీరోయిన్గా నటిస్తోంది.


ఈ సినిమాలో ప్రముఖ హాస్య నటుడు కమ్ హీరో సునీల్ ఓ కీలక పాత్రలో నటిస్తోన్నాడు. కాగా తాజాగా ఈ చిత్రం డబ్బింగ్ కార్య క్రమాలను మొదలు పెట్టింది. సునీల్ ఈ చిత్రంలో తన పాత్రకు సంబంధించి డబ్బింగ్ చెబుతున్నారు. కాగా ఈ సినిమా ఏప్రిల్ 12వ తేదీన విడుదల కానుంది.

Tags : Sai Dharamtej, Sunil

Write a comment ...
Post comment
Cancel