back

రంగస్థలం వివాదం పైన వివరణ ఇచ్చిన సుకుమార్



Share via:

రాంచరణ్ మరియు సుకుమార్ ల కెరీర్ లోనే అతి పెద్ద విజయం సాధించిన రంగస్థలం సినిమా కూడా ఒక వివాదం లో చిక్కుకుంది. అది పెద్దది కాకముందే సుకుమార్ వివరణతో ముగింపు పడింది. ఈ చిత్రంలోని చాలా అంశాలు ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకున్నాయి. అలాంటి వాటిలో కథానాయకుడు ప్రతినాయకుడ్ని ఆపద నుండి కాపాడి అతనికి ఆసుపత్రిలో అన్ని సేవలు చేసి బ్రతికించి మరీ చంపడం అనే చిత్ర క్లైమాక్స్ కూడ ఒకటి. అలాంటి ముగింపు రాసినందుకుగాను సుకుమార్ కు ఎన్నో ప్రశంసలు దక్కాయి. కానీ సుకుమార్ దాన్ని కాపీ కొట్టారని రచయిత ఎం. గాంధీ రచయితల సంఘానికి పిర్యాధు చేశారు.

రంగస్థలం క్లైమాక్స్ గురించి సుక్కు వివరిస్తూ......
“తన చిన్నపుడు ధర్మయుద్ధం చూసినప్పటి నుంచి తనలో మెదులుతున్న సన్నివేసం ఇది అని. తాను ఎంచుకున్న పాయింట్ కొత్తది కాదని, సిడ్నీ షెల్డన్ రచించిన ‘ఎ స్ట్రేంజర్ ఆన్ ద మిర్రర్’ నవలలో, చార్లెట్ జారెట్ దర్శకత్వం వహించిన టెలీ పిలింలో, షారుఖ్ ఖాన్-మాధురీ దీక్షిత్ జంటగా నటించిన ‘అంజామ్’ సినిమాలో, గాంధీ పేర్కొంటున్న ఎక్స్ ప్రెషన్ ఉందని సుకుమార్ తెలిపాడు. తాను కానీ, రంగస్థలం యూనిట్ సభ్యులు ఎవరు కానీ, గాంధీ అనే రచయితను కలవలేదని కూడా సుకుమార్ స్పష్టం చేశాడు. సుక్కు వివరణను ఉటంకిస్తూ అతడికి అనుకూలంగానే రచయితల సంఘం తీర్పు చెప్పింది. ఇది కాపీ రైట్ కిందికి రాదని స్పష్టం చేసింది.

Tags : Sukumar, Rangasthalam Issue, Ram Charan

Write a comment ...
Post comment
Cancel

Send Your Fan moments, Events, Association Details