back

తెలుగు మీడియా కంటే సోషల్ మీడియా నే మేలు - నాగబాబు



Share via:

తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ లో ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూ సంచలనంగా మారింది. తెలుగు మీడియాపై ఆయన చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద చర్చగా మారింది. తెలుగు మీడియాపై ఇంత ఓపెన్ గా మాట్లాడిన సెలబ్రిటీ ఇప్పటివరకూ ఎవరూ లేరన్న మాట వినిపిస్తోంది. ఇంతకూ నాగబాబు చేసిన సంచలన వ్యాఖ్యలు ఏమిటో చూస్తే..

సినిమాల్ని వదిలిన పవన్ సీరియస్ గా ప్రజల్లోకి వెళ్లారు. రాజకీయాల వైపు దృష్టి సారించారు. ఇప్పట్లో పవన్ సినిమాలు చేసే అవకాశం లేదు. ఇది అందరికి తెలిసిన విషయమే. కానీ.. తెలుగు మీడియాకు సంబంధించి అందరూ నమ్మే అగ్ర పత్రిక ఒకటి పవన్ వివరణ తీసుకోకుండానే.. ఆయన సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నట్లుగా వార్త ఒకటి అచ్చేసింది. ఈ వార్త వెనుక అసలు ఉద్దేశం ఏమంటే.. పవన్ రాజకీయాల పట్ల అంత సీరియస్ గా లేడు అని ప్రజల్ని పక్కదారి పట్టించడం చేయటం కోసమే.


టీడీపీకి పవన్ మద్దతు ఇచ్చినంత కాలం తెలుగు మీడియా ఆయన్ను సపోర్ట్ చేసింది. మద్దతు విరమించిన వెంటనే పవన్ మీద వ్యతిరేక కథనాలు ప్రసారం చేసిందన్నది మర్చిపోకూడదు. శ్రిరెడ్డి, కత్తి మహేష్ లాంటి వాళ్ళతో కావాలని చర్చలు పెట్టి మరి పవన్ తిట్టించడం ఈ మీడియా చానల్స్ విశప్రచారంలో ఒక భాగం.

2018 మార్చి 14 ముందు వరకూ పవన్ ట్వీట్లను ప్రముఖంగా స్క్రోలింగ్స్ ఇచ్చిన మీడియా ఛానల్స్.. ఆ తర్వాత పవన్ గిరిజనులతో.. ఇతర వర్గాలతో రోజుల తరబడి గడిపిన ఉదంతాల్ని పెద్దగా ఫోకస్ చేయలేదు. వారితో రోజుల తరబడి ఉన్నప్పటికీ ఆ వార్తల్ని ప్రముఖంగా ప్రచురించకపోవటంలో ఉద్దేశం ఏమిటి? తెలుగు మీడియా మొత్తం పవన్ కు వ్యతిరేకంగా ఉన్నా.. సోషల్ మీడియా మాత్రం సపోర్ట్ గా నిలిచింది. సోషల్ మీడియా కానీ లేకుంటే తమ పరిస్థితి దారుణంగా ఉండేది. అందుకే తాను సోషల్ మీడియాకు థ్యాంక్స్ చెబుతానన్నారు.


తాను చేసే విమర్శలన్ని మీడియా మీదనే కాని.. మీడియాలో పని చేసే జర్నలిస్టుల మీద కానేకాదు. నేను మాట్లాడుతున్నది మీడియా పెద్దల గురించి మాత్రమే. జర్నలిస్టులు ఆయా మీడియా సంస్థల్లో ఉద్యోగులు మాత్రమే. యాజమాన్యం చెప్పే పాలసీలకు అనుగుణంగా వారు పని చేయాల్సి ఉంటుంది. కానీ.. మీడియా మేనేజ్ మెంట్లు మాత్రం డబ్బుకు కక్కుర్తి పడి కొన్ని పార్టీలకు అనుకూలంగా వ్యవహరించాలని నిర్ణయించుకున్నాయి. అదే తీరులో పని చేస్తున్నాయి.

Tags : Nagababu Interview, Social Media, Telugu Media

Write a comment ...
Post comment
Cancel