back

శంకర్ దాదా 3 రాబోతుందా ..?



Share via:

మెగాస్టార్ చిరంజీవి నటించిన శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అందరికి తెలుసు. ఆహ్ సినిమాలో శ్రీకాంత్ అండ్ గ్యాంగ్ తో కలిసి చిరంజీవి చేసిన కామెడీ తెలుగు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది. ఆ సినిమాకి సీక్వెల్ గా వచ్చిన శంకర్ దాదా జిందాబాద్ సినిమా యావరేజ్ గా నిలిచింది. అయితే ఈ రెండు సినిమాలు రాజ్కుమార్ హీర్వాని సంజయ్ దత్ తో తీసిన మున్నాభాయ్ సిరీస్ కి రీమేక్ లే. ఇటీవలే సంజూ భాయ్ బయోపిక్ తెరకెక్కించిన హిరాణీ బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. ఆ క్రమంలోనే మున్నాభాయ్ సీక్వెల్ పార్ట్ 3 కథ రెడీ చేశానని తెలిపారు.


మున్నాభాయ్ ఎంబీబీఎస్ సిరీస్ లో మూడో సినిమాని ఈ కొత్త సంవత్సరంలో ఖాయం చేశారు. ఈ మూవీ తెరకెక్కుతున్న వేళ మన మెగాస్టార్ చిరంజీవి మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ సంజూభాయ్ ని కలిశారంటే అంతకుమించి ఆ ఇద్దరి మైండ్ లో ఏం ఉందో అర్థం చేసుకోవచ్చు. రెగ్యులర్ గానే చిరు.. దత్ కి టచ్ లో ఉంటారని చెబుతుంటారు. మొత్తానికి మున్నాభాయ్ - శంకర్ దాదా కలయికలో పెద్ద ప్లానింగే రన్ అవుతోందని అర్థమవుతోంది. ఇప్పటికే కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీలో మెగాస్టార్ 150 151 152 చిత్రాల్ని తీస్తున్న రామ్ చరణ్ తాజా సన్నివేశం చూస్తుంటే 154 కూడా లాక్ అవుతున్నట్టే అర్థమవుతోంది

ఫొటోస్ : శంకర్ దాదా తో మున్నా భాయ్

Tags : Megastar, Sanjay Dutt, Ram Charan, Shankar Dada 3

Write a comment ...
Post comment
Cancel