back

#RRR లో చేరిన మరో విలక్షణ నటుడు



Share via:

రామ్ చరణ్, జూ.ఎన్.టీ.ఆర్ లతో రాజమౌళి తీస్తున్న సినిమా #RRR. రాజమౌళి కొడుకు కార్తికేయ వివాహం కారణంగా మొదటి షెడ్యూల్ తరువాత లాంగ్ బ్రేక్ తీసుకున్న ఈ సినిమా మళ్ళి సంక్రాంతి తరువాత మోదులవనుంది. ఈ మధ్య సమయంలో భారీ సెట్ లు రెడీ అవుతున్నాయని టాక్, అలాగే సినిమాకి సంబంధించిన నటీనటుల ఎంపిక కూడా బాలీవుడ్ కి చెందిన ఒక కాస్టింగ్ ఏజెన్సీ చేస్తుంది. ఇప్పటి వరకు మనకు అధికారికంగా తెలిసిన పేర్లు కన్నడ స్టార్ యష్ మరియు తెలుగు కమెడియన్ రాహుల్ రామకృష్ణ. అయితే ఇప్పుడు ఇంకో పేరు బయటికి వచ్చింది ఆయనే తమిళ డైరెక్టర్ కం యాక్టర్ ‘సముద్రఖని’.

సినిమాల్లో నటించాలనే కోరికతో తమిళ ఇండస్ట్రీలోకి ఆడుగు పెట్టి, అవకాశాలు రాక దర్శకుడిగా మారి మంచి సినిమాలు తీసిన సముద్రఖని, తెలుగు లో కూడా రవితేజ తో శంభో శివ శంభో, నానితో జెండా పై కపిరాజు సినిమాలు తీసాడు.


అదే సమయంలో తనలో నటుడికి పని పెట్టిన సముద్రఖని రఘువరన్ బి.టెక్. సినిమాలో ధనుష్ తండ్రిగా తెలుగు ప్రజల మనసులో మంచి ముద్ర వేసారు. ఒకప్పుడు నటునిగా పనికి రాడనుకున్న అదే వ్యక్తి ఈ రోజు దేశం ఘర్వించే దర్శకుడు రాజమౌళి తీస్తున్న 300 కోట్ల బడ్జెట్ సినిమాలో స్థానం పొందడం విశేషమే.

Tags : Samuthirakani, RRR Movie, Ram Charan, NTR, Rajamouli

Write a comment ...
Post comment
Cancel