back

ప్రకృతిని కాపాడుకుందాం - సాయి ధరమ్ తేజ్Share via:

నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాలు జరపాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల సర్వత్రా విమర్శలు, వ్యతిరేకత ఎదురవుతోంది. ఈ విషయంలో తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్టు వ్యహరిస్తుండటంతో రాజకీయ, వ్యాపార, సినీ పరిశ్రమలకు చెందినవారు ఒక్కొక్కరిగా దీనిపై స్పందిస్తున్నారు. మన ప్రకృతిని కాపాడుకుందాం అంటూ యురేనియం తవ్వకాలను వ్యతిరేకిస్తూ ట్వీట్లు చేశారు. ఇప్పుడు ఈ జాబితాలో సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ కూడా చేరారు.

ప్రపంచంలోనే అతిపెద్ద రెయిన్ ఫారెస్ట్ అయిన అమెజాన్ అడవుల్లో కొద్ది రోజుల క్రితం కార్చిచ్చు చెలరేగిన సంగతి తెలిసిందే. భూ గ్రహంపై వెలువడే మొత్తం ఆక్సిజన్‌లో 20 శాతం ఈ అమెజాన్ అడవుల నుంచే ఉత్పత్తి అవుతుండటంతో ఇది అగ్నికి ఆహుతవుతుండంపై అంతా ఆందోళన వ్యక్తం చేశారు. మన సినిమా వాళ్లు వరసపెట్టి ట్వీట్లు చేశారు. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ఇప్పుడు సాయి ధరమ్ తేజ్ సూటిగా ప్రశ్నించారు. ఎక్కడో ఉన్న అమెజాన్ గురించి బాధపడ్డాం. మనం ఏం చేస్తున్నాం మరి. మన ప్రకృతిని కాపాడుకుందాం. సేవ్ నల్లమల’’ అని సాయి ధరమ్ తేజ్ ఫేస్ బుక్ లో పోస్ట్ చేసాడు

Tags : sai dharam tej, Nallamala Forest, Uranium Mining

Write a comment ...
Post comment
Cancel