back

కొత్త అవతారంలో సాయి ధరం తేజ్ ...



Share via:

ఈ మధ్య హీరోలందరికీ గడ్డం పెంచడం అనేది అలవాటు అయిపోయింది. అదే బాట పట్టాడు మన సుప్రీమ్ హీరో సాయి ధరం తేజ్ కూడా. వరుసగా 4 సినిమాలు ఫ్లాప్ అవ్వడంతో సినిమాలకి కొంచం గ్యాప్ ఇచ్చి తన గేటప్ మార్చుకునే పనిలో పడిన సాయి, నిన్నతన పుట్టిన రోజు సందర్భంగా అతడి కొత్త సినిమా ‘చిత్రలహరి’ ప్రారంభోత్సవం జరుపుకుంది. తన మేకోవర్ ఎలా ఉంధో ఈ కార్యక్రమంలో అందరికీ అతనో గుబురు గడ్డం చూడగానే అర్థం అయింది.

నేను శైలజ, ఉన్నదీ ఒకటే జిందగి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు కిషోర్ తిరుమల దర్శకత్వంలో తన తదుపరి సినిమా చేయబోతున్నాడు సాయి ధరం తేజ్. ఆ రెండు సినిమాల్లోనూ కిషోర్.. హీరో రామ్ ను కొన్ని సన్నివేశాల్లో గడ్డంతో చూపించాడు. ఇప్పుడు సినిమా మొత్తంలో తేజును గడ్డంతో చూపించేలా ఉన్నాడు. కిషోర్ సైతం ఎప్పుడూ గడ్డంతోనే కనిపిస్తాడన్న సంగతి తెలిసిందే.

Tags : Sai Dharam Tej, Chitralahari Movie Launch

Write a comment ...
Post comment
Cancel