back

ఛలో అనబోతున్న సాయి ధరం తేజ్



Share via:

వరుస హిట్లతో పరిశ్రమలో ఒక కెరటంలా ఎగిసిన మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్, ఇప్పుడు వరుస సినిమాలు నిరుత్సాహపరచడంతో డీలా పడిపోయాడు. ఇప్పుడు కరుణాకరన్ తీస్తున్న “తేజ్ ఐ లవ్ యు” పైనే తన ఆశలు అన్ని పెట్టుకున్నాడు. ఇంతలో అల్లు అరవింద్ గీత ఆర్ట్స్ బ్యానర్ పైన సాయి హీరోగా ఈ మధ్యే ఛలో సినిమాతో అందరిని ఆకట్టుకున్న దర్శకుడు, మెగా అభిమాని వెంకి కుడుముల తో సినిమా తీయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

కథ కూడా దాదాపు సెట్ అయ్యిందని, దాని పైన నిర్మాత హీరో డిస్కర్షన్స్ లో ఉన్నట్లు సమాచారం. ఒక రోజు కూర్చొని సినిమా గురించి పూర్తిగా చర్చలు జరిపి బడ్జెట్ లాక్ చేయనున్నారట. ఒకసారి ఫిక్స్ చేస్తే అల్లు అరవింద్ ఆగరని అందరికి తెలిసిందే. ఇక అదే తరహాలో ఈ కాంబో స్పీడ్ అందుకుంటుందని సమాచారం. త్వరలోనే అధికారికంగా ఆ న్యూస్ ఎనౌన్స్ చేసే అవకాశం ఉంది.

Tags : Sai Dharam Tej New Movie in Geetha Arts

Write a comment ...
Post comment
Cancel