back

‘పిల్ల జమిందార్’ గా సాయి ధరం తేజ్



Share via:

వరుస అపజయాలతో కొంత సమయం తీసుకుని ఒక సినిమా తీస్తున్నాడు మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్. నేను శైలజ ఫేం కిషోర్ తిరుమల దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో వస్తున్న ‘చిత్రలహరి’ సినిమా పైనే ఇప్పుడు సాయి ఆశలు అన్ని ఆధారపడి ఉన్నాయి. ఈ సినిమా అయ్యేంత వరకు ఇంకో సినిమా గురించి ఆలోచించకూడదనే అనుకున్నాడు తేజు. కానీ మధ్యలో అతడిని మరో టాలెంటెడ్ దర్శకుడు అశోక్ కొత్త కథతో డిస్టర్బ్ చేసాడు.


‘పిల్ల జమీందార్’.. ‘భాగమతి’ లాంటి హిట్ సినిమాలు తీసిన అశోక్.. ఇటీవలే సాయి ని కలిసి ఒక కథ చెప్పినట్లు సమాచారం. ‘భాగమతి’ తరహాలోనే ఇదొక వెరైటీ థ్రిల్లర్ అని తెలిసింది. స్క్రిప్టు చాలా బాగుండటంతో తేజు ఈ సినిమా చేయడానికి ఓకే చెప్పేశాడట. తేజు-అశోక్ సినిమాను అల్లు అరవింద్ నిర్మిస్తున్నారని టాక్. మరి అశోక్ ఈ సినిమాతో తేజు లోని పిల్ల జమిందార్ ని బయటికి తీస్తాడేమో....

Tags : Sai Dharam Tej, Director Ashok

Write a comment ...
Post comment
Cancel