back

తేజు కొత్త సినిమాకి సరికొత్త పేరు...



Share via:

ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో పని చేస్తున్న సుప్రీమ్ హీరో సాయి ధరం తేజ్ ప్రస్తుత ఆశలన్ని రిలీజ్ కి రెడీ అయిన ‘తేజ్ ఐ లవ్ యు’ పైనే.. అంతలోనే ఇంకో రెండు సినిమాలను లైన్ లో పెట్టిన తేజు, అందులో ఒకదానికి పేరు కూడా డిసైడ్ చేసేసారు.

నేను శైలజ దర్శకుడి కిషోర్ తిరుమలతో తేజు ఒక సినిమాను ఒకే చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ సినిమాకు 'చిత్ర లహరి' అని టైటిల్ సెట్ చేసిన సినిమా యూనిట్ ఇప్పుడు దానికి ఒక ట్యాగ్ లైన్ ను సెట్ చేసినట్లు తెలుస్తుంది. 'బార్ అండ్ రెస్టారెంట్' అనే ట్యాగ్ లైన్ ను సినిమా కథకు తగ్గటుగా సెట్ చేశారని సమాచారం. దీనిని బట్టి ఈ సినిమా మొత్తం చిత్రలహరి అనే బార్ అండ్ రెస్టారెంట్ చుట్టూ తిరిగే కథగా అర్థం అవుతుంది. ఇది చూస్తుంటే ఏదో కొత్త తరహ సినిమాలాగా అనిపిస్తోంది! జులై నుంచి స్టార్ట్ కాబోయే ఆ సినిమాతో సాయి ధరమ్ తేజ్ ఏ రేంజ్ లో హిట్ అందుకుంటాడో చూడాలి.

వీడియో: అందమైన చందమామ వీడియో సాంగ్ | తేజ్ I Love U

Tags : Sai Dharam Tej - Kishore Tirumala Movie Title

Write a comment ...
Post comment
Cancel