back

“చిత్రలహరి” తో సాయి ధరం తేజ్ కరువు తీరేనా...?



Share via:

మెగాస్టార్ , పవర్ స్టార్ ల మేనల్లుడిగా సిని ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టిన సాయి ధరం తేజ్ తన మొదటి సినిమా తో పరాజయం చూసిన తర్వాత వరుసగా “పిల్ల నువ్వు లేని జీవితం”, “సుబ్రహ్మణ్యం ఫర్ సేల్”, “సుప్రీమ్” లతో హట్రిక్ విజయాలు సాధించాడు. మెగాస్టార్ కుటుంభం నుంచి ఇంకో స్టార్ తయారవుతున్నాడ అని అనుకుంటున్నా సమయం లో రెండు సంవత్సరాల గ్యాప్ లో 5 వరుస పరాజయాలు సాయి ని వెనక్కి లాగేసాయి. దీంతో కొంచం గ్యాప్ తీసుకుని తను స్టార్ట్ చేసిన సినిమా “చిత్రలహరి”.

‘నేను శైలజ’ ఫేమ్ కిషోర్ తిరుమల దర్శకత్వంలో కొత్త చిత్రం ‘చిత్రలహరి’.. సోమవారం సాయి పుట్టినరోజున హైదరాబాద్లో లాంఛనంగా ప్రారంభమైంది. సినిమా ముహూర్తపు సన్నివేశానికి డైరెక్టర్ కొరటాల శివ క్లాప్ కొట్టగా.. సాయిధరమ్ తేజ్ అమ్మగారు విజయ కెమెరా స్విచ్ఛాన్ చేశారు. అపజయం లేని నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మరి నవంబర్ 2 నుంచి షూటింగ్ ప్రారంభం అవనున్న ఈ సినిమా అయిన సాయి ధరం తేజ్ విజయపు కరువుని తీరుస్తుందో లేధో వేచి చూడాలి.

Tags : Sai Dharam Tej, Chitralahari Movie

Write a comment ...
Post comment
Cancel
saakshyam
2018-10-24 02:38:44

click here for more updates:http://bit.ly/2OCSvR2


Reply
Post comment
Cancel