back

ఇక్కడ ఫ్లాప్ కాని అక్కడ హిట్ @ సాయి ధరం తేజ్ సినిమాలు



Share via:

మెగా మేనల్లుడు గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన సాయి ధరం తేజ్ తీసిన మొదటి సినిమా ‘రేయ్’ ఎవ్వరికీ పెద్ద గుర్తు ఉండదు. తరువాత తను తీసిన మూడు సినిమాలు ‘పిల్ల నువ్వు లేని జీవితం’, ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’, ‘సుప్రీమ్’, హిట్ అవ్వడంతో తేజు , చిన్న, మధ్య స్థాయి నిర్మాతలకు ఒక మంచి అవకాసం అయ్యాడు. కాని ఆ తరువాత వరుసగా 5 ఫ్లాపులతో తన కెరీర్ ప్రమాదంలో పడింది. అయితే ఇక్కడ ఫ్లాప్ అయిన తేజు సినిమాలు అక్కడ మాత్రం హిట్ అవుతున్నాయి. అక్కడ అంటే యుట్యూబ్ లో..


“తేజుకి సంబంధించి హిందీలో డబ్ అయిన సినిమాలు.. ‘రేయ్’, సుప్రీం, జవాన్, తేజ్ ఐలవ్ యూ’ చిత్రాలు యూట్యూబ్లో అత్యధిక వ్యూస్ను రాబడుతున్నాయి. ‘రేయ్’ వచ్చేసి 9.1 మిలియన్ వ్యూస్ను రాబట్టగా, సుప్రీం మూవీ 27 మిలియన్ వ్యూస్ను రాబట్టింది. ‘జవాన్’ వచ్చేసి 38 మిలియన్ల వ్యూస్ను రాబడితే, ‘తేజ్ ఐ లవ్ యూ’ 37 మిలియన్ల వ్యూస్ను రాబట్టింది.” ఇది చూస్తుంటే హిందీ లో డబ్బింగ్ సినిమాలు చూసే జానాలకు తేజు బాగా నచ్చినట్లు ఉన్నాడు. అల్లు అర్జున్ ఫ్లాప్ సినిమాలు కూడా హిందీ డబ్బింగ్ తో యుట్యూబ్ లో అదరగొడుతున్నాయి. మరి తేజు తన తర్వాతి సినిమా ‘చిత్రలహరి’ తో మళ్ళి హిట్ ట్రాక్ లోకి వస్తాడేమో చూడాలి.

Tags : Sai Dharam Tej Films

Write a comment ...
Post comment
Cancel
Babu winner
2019-01-03 23:19:56

Pakka Saidharamtej fan


Reply
Post comment
Cancel