back

“తేజ్ ఐ లవ్ యు” పైనే సాయి భవిష్యతు ...



Share via:

వరుసగా మూడు హిట్ల తరవాత వరుసగా నాలుగు ఫ్లాప్లు ఇచ్చిన సాయి ధరం తేజ్ భవిష్యత్తు ఇప్పుడు రిలీజ్ కాబోతున్న “తేజ్ ఐ లవ్ యు” మీదనే ఆధారపడి ఉంది.

సాయి ఇప్పటికే గోపీచంద్ మలినేని తో ఒక సినిమా అలాగే కిశోరే తిరుమల తో ఒక సినిమా కథ చర్చలు ఐపోయాయి. కాని ఇంకా ఫైనల్ కాలేదని అంటున్నారు. తన కెరీర్ కు కీలకమైన ‘తేజ్ ఐ లవ్యూ’ సంగతి తేలాకే వేరే సినిమా మీద దృష్టిపెట్టాలనుకుంటున్నాడతను. ఒకానొక టైంలో ‘పిల్లా నువ్వు లేని జీవితం’.. ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’.. ‘సుప్రీమ్’ లాంటి సినిమాలతో మాంచి ఊపులో కనిపించాడు తేజు. కానీ ఆ తర్వాత వరుస ఫ్లాపులతో సతమతమతయ్యాడు. ‘తిక్క’.. ‘విన్నర్’.. ‘నక్షత్రం’.. ‘జవాన్’.. ‘ఇంటిలిజెంట్’ లాంటి డిజాస్టర్లు అతడి కెరీర్ ను బాగా దెబ్బ తీశాయి. ముఖ్యంగా ‘ఇంటిలిజెంట్’ తేజును అన్ని రకాలుగా డీలా పడిపోయేలా చేసింది.

తేజ్... I Love U ఆడియో లాంచ్ కి చీఫ్ గెస్ట్ ఎవరు?? ఇక్కడ చుడండి...

ఈ నేపథ్యంలో ‘తేజ్ ఐలవ్యూ’ అతడి కెరీర్ కు కీలకంగా మారింది. తేజు సరసన అనుపమ పరమేశ్వరన్ నటిస్తున్న ఈ చిత్రాన్ని క్రియేటివ్ కమర్షియల్స్ బేనర్ మీద సీనియర్ ప్రొడ్యూసర్ కె.ఎస్.రామారావు నిర్మిస్తున్నారు.

ఫొటోస్: తేజ్ ప్రీమియర్ లీగ్ లో సాయి ధరం తేజ్

తేజ్... I Love U నుండి ఈ పాట చూసారా?? ఇక్కడ చుడండి...

Tags : Sai Dharam Tej, Tej I Love U, Karunakaran, Anupama Parameswaran

Write a comment ...
Post comment
Cancel