back

షూటింగ్ కి రెడీ అయిన సాయి “చిత్రలహరి”



Share via:

‘నేను శైలజ’ ఫేమ్ కిషోర్ తిరుమల దర్శకత్వంలో కొత్త చిత్రం ‘చిత్రలహరి’.. పోయిన నెలలో సాయి పుట్టినరోజున హైదరాబాద్లో లాంఛనంగా ప్రారంభమైంది. సినిమా ముహూర్తపు సన్నివేశానికి డైరెక్టర్ కొరటాల శివ క్లాప్ కొట్టగా.. సాయిధరమ్ తేజ్ అమ్మగారు విజయ కెమెరా స్విచ్ఛాన్ చేశారు. అపజయం లేని నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మరి నవంబర్ 12 నుంచి షూటింగ్ ప్రారంభం అవనున్న ఈ సినిమా అయిన సాయి ధరం తేజ్ విజయపు కరువుని తీరుస్తుందో లేధో వేచి చూడాలి.

రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా లావణ్య, నివేత పెతురాజ్ కథానాయకులుగా నటిస్తున్నారు. ఇక ఈ చిత్రంతో ఎలాగైనా విజయం సాధించి మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కాలని పట్టుదలగా వున్నాడు తేజ్. మరోవైపు ఈచిత్రం విజయం సాధించడం కిశోర్ తిరుమలకు కూడా చాలా అవసరం.

Tags : Sai Dharam Tej, Chitralahari Movie, Kishore Tirumala

Write a comment ...
Post comment
Cancel