back

36 సంవత్సరాల తర్వాత చిరంజీవితో స్క్రీన్ షేర్ చేసుకుంటున్న ప్రముఖ నటుడు



Share via:

ప్రముఖ నటుడు సాయి చంద్ 36 సంవత్సరాల తరువాత మెగాస్టార్ చిరంజీవితో కలిసి తెరని పంచుకోబోతున్నారు.

చిరంజీవి టైటిల్ పాత్ర పోషిస్తున్న సైరా నరసింహ రెడ్డి చిత్రంలో సాయి చంద్ నరసింహారెడ్డికి దగ్గరి సహాయకుడి పాత్రలో కనిపించనున్నట్టు వినికిడి.

వీరిద్దరు కలిసి చివరగా 1982లో విడుదలైన 'మంచు పల్లకి' చిత్రంలో నటించారు.

ఇటివలే సైరా చిత్ర షూటింగ్లో కలిసి పాల్గొన్న వీరిద్దరు అప్పటి రోజులని, విషయాలని గుర్తుచేసుకుంటూ చాలా ఆనందంగా గడిపారని చిత్ర యూనిట్ వర్గాల సమాచారం.

అక్కినేని నాగార్జునతో 28 ఏళ్ళ క్రితం నటించిన 'శివ' చిత్రం తర్వాత కనుమరుగైన సాయి చంద్ 2017లో వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన 'ఫిదా' చిత్రంతో మల్లి ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ చిత్రంలో హీరోయిన్ సాయి పల్లవికి తండ్రిగా నటించి మెప్పించారు.

Tags : Sai Chand, Megastar Chiranjeevi, Sye Raa Narasimha Reddy

Write a comment ...
Post comment
Cancel