back

#RRR లో తారక్ తర్వాతే చరణ్



Share via:

రాజమౌళి దర్శకత్వంలో ఎన్.టి.ఆర్ రాంచరణ్ కలిసి నటిస్తున్న #RRR చిత్రం ఇటు అభిమానుల్లో అటు ప్రేక్షకుల్లోనే కాకుండా ట్రేడ్ వర్గాల్లో కూడా చాలా హైప్ క్రియేట్ చేస్తుంది.

ఇప్పుడు ఈ చిత్రం గురించి అందిన తాజా సమాచారం ప్రకారం #RRR చిత్రం నవంబర్ నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనున్నట్టు తెలుస్తుంది. ఈ చిత్రానికి సంబందించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుపుకుంటుంది.

అలాగే ఈ సినిమా షూటింగ్లో మొదట తారక్ ఆ తర్వాతే చరణ్ పాల్గొననున్నట్టు సమాచారం. ప్రస్తుతం బోయపాటి సినిమా షూటింగ్లో బిజీగా గడుపుతున్న రాంచరణ్ నవంబర్లో ఆ సినిమా షూటింగ్ ముగించుకొని డిసెంబర్లో #RRR చిత్ర షూటింగ్లో పాల్గొననున్నట్టు తెలుస్తుంది. డిసెంబర్ వరకు జక్కన్న తారక్ తో సోలో సీన్స్ షూట్ చేయ్యనున్నట్టు సమాచారం.

ఈ సినిమా యొక్క ముఖ్య భాగం రామోజీ ఫిలిం సిటీలోని భారీ సెట్లో మరియు అల్యూమినియం ఫ్యాక్టరీలో చిత్రికనిన్చానున్నారు.

Tags : #RRR Movie, Ram Charan, Jr. NTR, SS Rajamouli

Write a comment ...
Post comment
Cancel