back

RRR ఎన్ని బాషలలో రిలీజ్ అవుతుందో తెలుసా..?



Share via:

బాహుబలి 1 సాధించిన విజయంతో బాహుబలి 2 ని దేశవ్యాప్తంగా 5 బాషలలో రిలీజ్ చేసిన ఆ సినిమా నిర్మాతలు తరువాత చైనీస్, జపనీస్, జర్మన్ బాషలలో డబ్ చేసి ఆయా దేశాలలో కూడా రిలీజ్ చేసి విజయం సాధించారు.

బాహుబలి సినిమాలతో ప్రపంచవ్యాప్తంగా పేరు సంపాదించిన రాజమౌళి, ఇప్పుడు తీయబోయే RRR సినిమా పైన కూడా అన్ని చోట్ల మంచి క్రేజ్ ఉంది. అందుకే ఈ క్రేజ్ ని వాడుకుని 300 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ RRR సినిమాని కూడా అన్ని భాషలలో రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు.

మొదటగా ఈ సినిమాని తీసేటప్పుడే 3 బాషలు తెలుగు, తమిళ్ మరియు హిందీలను దృష్టిలో పెట్టుకుని తీయబోతున్నారు. తరువాత మలయాళం మరియు విదేశీ బాషలయిన చైనీస్, జపనీస్ లలోకి అనువదించాలని డిసైడ్ అయ్యారంట.

బాహుబలి తర్వాత జపాన్ లో రిలీజ్ అయిన మగధీర సినిమా కూడా అక్కడ ఘనవిజయం సాధించటం వలన రామ్ చరణ్ కి కూడా జపాన్ లో క్రేజ్ ఏర్పడింది. అందువల్ల భారతదేశంతో పాటు జపాన్ లో కూడా ఒకటేసారి రిలీజ్ చేయాలనే ప్లాన్లో ఉన్నారంట దర్శక నిర్మాతలు.

Tags : RRR, Ram Charan, NTR, Rajamouli, Telugu, Tamil, Hindi, Malayalam, Japanese, Chinese

Write a comment ...
Post comment
Cancel