back

RRR అసలు కథ చెప్పేసిన రాజమౌళి



Share via:

రాజమౌళి -రాంచరణ్ -ఎన్టీఆర్ , ఈ కాంబో వల్ల ఈ సినిమాకి వచ్చిన విపరీతమైన క్రేజ్ ని అలాగే నడిపిస్తూ రాజమౌళి చేస్తున్న పనులు ఇంకా ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఇక ఈ రోజు జరిగిన RRR ప్రెస్ మీట్ లో దర్శకుధీరుడు రాజమౌళి మూవీ కథపై క్లారిటీ ఇచ్చాడు.

ఇది 1920 నాటి ఫిక్షనల్ స్టోరీ బేస్డ్ మూవీ అని ఇద్దరు స్వాతంత్ర్య సమరయోధులు అల్లూరి సీతారామరాజు, కొమరంభీలు కలిసి పోరాడితే ఎలా ఉంటుంది అనే కోణంలో కథ ఉంటుంది అని స్టోరీ లైన్‌ను మీడియాకి వివరించారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో నటిస్తుండగా.. అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ నటిస్తున్నారు. డీవీవీ దానయ్య 350-400 cr బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈచిత్రం 2020 జూలై 30న ప్రేక్షకుల ముందుకు రానుంది.

‘ఇలాంటి పెద్ద హీరోలు ఉన్న సినిమాకి సపోర్టింగ్ కాస్ట్ కూడా ఉండాలి. బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ ఈ సినిమాలో కీలకపాత్ర పోషిస్తున్నారు. ఫ్లాష్ బ్యాక్‌లో వచ్చే పవర్ ఫుల్ క్యారెక్టర్‌లో ఆయన నటిస్తున్నారు. రామ్‌చరణ్ సరసన అలియా భట్ నటిస్తోంది. తారక్ సరసన డేజీ అడ్గారియన్స్ నటిస్తోంది.

'RRR' కేవలం వర్కింగ్ టైటిల్ మాత్రమే కానీ ఇదే టైటిల్ ఫిక్స్ చేసాము . అన్ని భాషల్లో ఇది కామన్‌గా ఉంటుంది.. నా సినిమాలో యంగ్ అల్లూరి సీతారామరాజుగా చరణ్, యంగ్ కొమరం భీంగా తారక్ కనిపించబోతున్నారు'' అని చెప్పారు రాజమౌళి.

Tags : RRR story, Rajamouli, Ramcharan, Jr NTR

Write a comment ...
Post comment
Cancel