back

RRR కథ ఇదేనా...!



Share via:

ఈ నెల 11 న పూజ తర్వాత 19 న షూటింగ్ మొదలుపెట్టుకున్న RRR కు సంబంధించి మొదటి రోజు ఓ రెండు ఫోటోలు తర్వాత తాను యాక్షన్ చెబుతున్న వీడియోను షేర్ చేసుకున్నాక రాజమౌళి సీక్రెట్ మోడ్ లోకి వెళ్ళిపోయాడు.

ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ సెట్ కు సంబంధించిన కొన్ని ఫోటోలు లీక్ కావడంతో అలెర్ట్ అయిన జక్కన్న టీం ఇకపై సిసి కెమెరాలు కూడా సెట్ చేసే దిశగా చర్యలు తీసుకొబోతోందని టాక్.

ఇక కథకు సంబంధించి అప్పుడప్పుడు కొన్ని అప్ డేట్స్ బయటికి వస్తున్నాయి కాని ఏది అబద్దమో ఏది నిజమో అర్థం కాని పరిస్థితి నెలకొంది.

విశ్వసనీయ సమాచారం మేరకు ఇందులో ఎన్టీఅర్ గజదొంగగా రాంచరణ్ పాత్ర అతన్ని పట్టుకోవడానికి బ్రిటిష్ వాళ్ళు నియమింపబడ్డ పోలీస్ ఆఫీసర్ గా ఉంటుందని తెలిసింది.

స్వతంత్రం రాకముందు 1920 నాటి కాలంలో జరిగినట్టు ఇదంతా చూపిస్తారట. బందిపోటు కాబట్టి రఫ్ లుక్ ఉండాలనే ఉద్దేశంతో ఎన్టీఆర్ మేకప్ ని స్పెషల్ గా డిజైన్ చేయించాడట జక్కన్న. ఇద్దరి మధ్య కొంత సంఘర్షణ అయ్యాక ఇద్దరు ఒక్కటై బ్రిటిష్ సామ్రాజ్యం మీద తిరుగుబాటు జెండా ఎగురవేయడం సినిమాలోని మెయిన్ థీమ్ అని టాక్.

ఇది నిజమో కాదో కాని ప్రచారం అయితే మహా జోరుగా ఉంది. బయటికి వచ్చిన కొన్ని సెట్స్ ఫొటోస్ కూడా ఈ సినిమాలో స్వతంత్రం ముందు జరిగిన కథ ఉంటుందని చెప్పచ్చు.

2020 వేసవిలో విడుదల అయ్యే దాకా ఇలా కొత్త కొత్త కథల ప్రవాహం కొనసాగుతూనే ఉంటాయి.

Tags : RRR Movie Story, Ram Charan, NTR, Rajamouli

Write a comment ...
Post comment
Cancel