back

డిసెంబర్ లో సెట్స్ పైకి #RRR....



Share via:

సినిమా అనౌన్సు చేసి చాల కాలం అవుతున్న అభిమానులు వెయిట్ చేస్తున్నారంటే అది ఆ దర్శకుడు పైన ఉన్న నమ్మకం. ఆ నమ్మకం నిలబెట్టుకోవడం కోసం చాల రోజుల నుంచి కసరత్తు చేస్తున్న ధర్శకదీరుడు ఎస్.ఎస్.రాజమౌళి, ఇక సినిమా షూటింగ్ ని పట్టాలెక్కించబోతున్నాడు. దానికి ముహూర్తం డిసెంబర్ నెలగా నిశ్చయించినట్లు తెలుస్తుంది. ఈ మధ్యలో నటీనటులతో ఒక వర్క్ షాప్ నిర్వహించి తర్వాత షూటింగ్ మొదులవ్వబోతుంది.

మరోవైపు ఈ సినిమా కోసం సెట్టింగ్స్ దాదాపుగా పూర్తయ్యాయట. మరోవైపు కీరవాణి మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా మొదలు పెట్టేసినట్లు వార్తలొస్తున్నాయి. సాయి మాధవ్ బుర్ర మరియు విజయేంద్ర ప్రసాద్ నేతృత్వం లోని రచయతల టీం తమ పని పూర్తి చేసేస్తుంది. ఇదంతా చూస్తుంటే రాజమౌళి ఈ సారి సినిమాని త్వరగానే రిలీజ్ చేసేలా ఉన్నాడు. చూద్దాం మరి ఈ చరణ్-ఎన్టీఅర్ ల కాంబో 2019 రిలీజ్ అవుతుందేమో....

Tags : RRR Movie, Ram Charan, NTR, Rajamouli

Write a comment ...
Post comment
Cancel