back

RRR తాజా విశేషాలు...



Share via:

రాజమౌళి ఒక సినిమా టేకప్ చేశాడంటే ప్రేక్షకులకు దానిపై ఎంతో ఆసక్తి ఉంటుంది. జక్కన్న టీమ్ వద్దనుండి వచ్చే అప్డేట్ల కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తారు.  ఇక అధికారికంగా వచ్చే అప్డేట్ల తో పాటుగా అనదికారికా అప్డేట్లు.. రూమర్లు.. లీక్ అయ్యే ఫోటోలు ఇవన్నీ సర్వసాధారణం.

తాజాగా మూడు విశేషాలు సినిమా పైన అంచనాలను ఇంకా పెంచుతున్నాయి...అవేంటంటే

1. రోబో 2.0 లో వాడిన 4డీ సౌండ్ టెక్నాలజీని మరింత సమర్థంగా ఉపయోగించుకునేందుకు తన టెక్నికల్ టీంతో రాజమౌలి ప్రణాళిక రచించాడట. ఇందుకోసం హాలీవుడ్ నుంచి హైఎండ్ పరికరాలు తెప్పించాడట.

2. రెండు రోజుల కిందటే ‘ఆర్ ఆర్ ఆర్’ రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. నేరుగా యాక్షన్ సీక్వెన్స్ తో చిత్రీకరణ మొదలుపెట్టారు. ఈ సీక్వెన్స్ కోసం 120 కెమెరాలు వాడుతున్నట్లు వార్తలొస్తుండటం విశేషం.

3.రాజమౌళి తెరకెక్కిస్తున్న #RRR భారీ సెట్ల నిర్మాణం జరుగుతోందన్న విషయం తెలిసిందే కదా. అందులో ఒక సెట్ ఫోటో బయటకు వచ్చింది.

4. గండిపేటలో సీబీఐటీ కాలేజీకి సమీపంలో ఈ సెట్ నిర్మాణం జరుగుతోందట. ఈ సెట్ నిర్మాణం పూర్తయిన తర్వాత మూడు నెలల పాటు షూటింగ్ జరుగుతుందట. ఈ సెట్ వాలకం చూస్తుంటే బ్రిటిష్ కాలం నాటి పాత బిల్డింగ్ అనే అనిపిస్తోంది.  #RRR కథ స్వాతంత్ర్య పోరాటం నేపథ్యంలో ఉంటుందని ఇప్పటికే వార్తలు వచ్చాయి కాబట్టి ఈ సెట్ నిర్మాణం ఆ వార్తలకు బలం చేకూరుస్తోంది. 

మీ కోసం మరిన్ని RRR విశేషాలు తొందరలో అందిస్తాం .

Tags : RRR Movie, Ram Charan, NTR

Write a comment ...
Post comment
Cancel