back

#RRR గురించి కొత్త విశేషాలు..



Share via:

రాజమౌళి ఎప్పుడైతే రాంచరణ్, ఎన్టీఆర్ ల తో మల్తిస్తార్రెర్ సినిమాగా #RRR ప్రకటించారో, అప్పటినుంచి ఈ సినిమా వార్తలో దేశవ్యాప్తంగా చర్చిస్తున్నారు. ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి రెండు కొత్త విషయాలు బయటికి వచ్చాయి..అవి ఏంటంటే..

1. సాధారణంగా రాజమౌళి టీమ్ లో పెద్దగా మార్పులు ఉండవని అందరికి తెలిసిందే.  సినిమాటోగ్రఫర్ సెంథిల్ కుమార్ తో రాజమౌళి వండర్స్ క్రియేట్ చేశాడు. తన ఆలోచనలకు తగ్గట్టు పని చేస్తుండడంతో రాజమౌళి మరో కెమెరామెన్ ను వెతుక్కోలేదు. ఈ సారి రాజమౌళి ఆ ఛాన్స్ వేరే వ్యక్తికి ఇవ్వనున్నట్లు కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. మహానటి సినిమా విజయంలో కేమెరా పని తనం చాలానే ఉంది. మహానటి సినిమాతో కేమెరా వర్క్ కు కొత్త అర్ధాన్ని చెప్పిన డాని తో కలిసి రాజమౌళి వర్క్ చేయాలని అనుకుంటున్నాడట.

2. రాజమౌళి సినిమాల్లో ఉండే భారీ సెట్టింగ్స్ అన్ని ఇప్పటివరకు రామోజీ ఫిలిం సిటీ లోనే వేసారు అయితే ఇప్పుడు మాత్రం సెట్ ఫిలిం సిటీలో వేయడం లేదు. ఇంతకుముందు చాలా సినిమాల్లో కనిపించిన గచ్చిబౌలిలోని అల్యూమినియం ఫ్యాక్టరీ కాంపౌండ్ లోని విశాలమైన ఖాళీ స్థలంలో వేస్తున్నారు. ఈ సినిమా నిర్మాతలు భారీ మొత్తం ముట్టజెప్పి ఫ్యాక్టరీ ఆవరణను రెండేళ్లపాటు లీజుకు తీసుకున్నారు. ఆర్ట్ డైరెక్టర్ సాబు సిరిల్ సెట్ రూపకల్పన పని మొదలెట్టేశాడు.

 

ఇలా ఒక్కోరోజు ఒక్కో వార్త ఈ సినిమా గురించి తెలుస్తున్నాయి, మరి వీటిలో నిజం ఎంతవరకు అనేది కాలమే చెబుతుంది.

Tags : RRR Movie, Ram Charan, Rajamouli, NTR, Unknown and Interesting Facts About RRR Movie

Write a comment ...
Post comment
Cancel