back

RRR మళ్ళి సంక్రాంతి తర్వాతే ..!



Share via:

రామారావు-రామ్ చరణ్ కాంబినేషన్ లో ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కిస్తున్న RRR ఈ నవంబర్ నెల 11న ఘనంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీ పరిసరాల్లోని సెట్స్లో 19 నుంచి రెగ్యులర్ చిత్రీకరణ మొదులవగా భారీ యాక్షన్ ఎపిసోడ్ తో ఫస్ట్ షెడ్యూల్ ని 3వ తేదీతో పూర్తి చేసింది జక్కన టీం.

300 కోట్ల బడ్జెట్ తో డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్ర రెండో షెడ్యూల్ మాత్రం సంక్రాంతి తర్వాతే అంటున్నారు. దీనికి కారణాలు...

రాజమౌళి కొడుకు కార్తికేయ పెళ్లి జనువరి మొదటి వారంలో ఉండడం.
హీరాయింలు మరియు ఇతర నటీనటుల ఎంపిక ఇంకా పూర్తి కాకపోవడం.
వినయ విదేయ రామలో ఒక పాట షూటింగ్ మరియు ఆ సినిమా ప్రచారంలో రాంచరణ్ పాల్గొనాల్సి ఉండడం.

అయితే సంక్రాంతి తరువాత మాత్రం ఈ సినిమా బ్రేక్ లేకుండా జరుగుతుందని అంటున్నారు సినిమా యూనిట్ సభ్యులు. రాజమౌళి ఇదంతా ముందే పక్కాగా ప్లాన్ చేసుకున్నారు అంటున్నారు.

Tags : RRR Movie 2nd Schedule, Ram Charan, Rajamouli, NTR

Write a comment ...
Post comment
Cancel