back

`RRR`షూటింగ్ వివరాలు



Share via:

ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి తెరకెక్కిస్తున్న 'ఆర్​ఆర్​ఆర్'​ చిత్రం శరవేగంగా షూటింగ్​ జరుపుకొంటోంది. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ హీరోలుగా రూపొందుతోన్న భారీ మ‌ల్టీస్టార‌ర్ `RRR`. ఇప్పటికే తొలి భాగం చిత్రీకరణ పూర్తి చేసుకొని రెండో షెడ్యూల్ కోసం బల్గెరియా వెళ్లిన చిత్ర బృందం షూటింగ్ పూర్తి చేసుకొని తిరిగి వచ్చింది.ఈ షెడ్యూల్‌ను తార‌క్‌తో చిత్రీక‌రించారు ఇందులో తార‌క్ ఇంట్ర‌డ‌క్ష‌న్ స‌న్నివేశాలు, కొన్ని యాక్ష‌న్ స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించారట‌. షెడ్యూల్ పూర్తి చేసుకున్నతార‌క్ హైద‌రాబాద్ చేరుకున్నారు. త‌దుప‌రి షెడ్యూల్ హైద‌రాబాద్‌లోనే జ‌ర‌గ‌నుంద‌ట‌. ఈ షెడ్యూల్‌లో రామ్‌చ‌రణ్ పాల్గొంటారని సమాచారం. ఈ చిత్రంలో తెలంగాణ పోరాట యోధుడు కొమురం భీమ్‌గా తార‌క్‌.. మ‌న్యం వీరుడు అల్లూరి సీతారామ‌రాజుగా రామ్‌చ‌ర‌ణ్ న‌టిస్తున్నారు. రెండు నిజ పాత్ర‌ల‌కు సంబంధించిన క‌ల్పిత‌గాథే ఈ చిత్రం. వ‌చ్చే ఏడాది జూలై 30న విడుద‌ల చేయాల‌నుకుంటున్నట్లు ద‌ర్శ‌క నిర్మాత‌లు ఇది వ‌ర‌కే ప్ర‌క‌టించారు. ఇందులో ఆలియా భ‌ట్‌, అజ‌య్ దేవ‌గ‌ణ్‌, స‌ముద్ర‌ఖ‌ని త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.

Tags : Raja mouli, Ram charan, NTR, RRR movie.

Write a comment ...
Post comment
Cancel