back

బాహుబలి ని మించిపోయే RRR - రాజమౌళి



Share via:

ఎట్టకేలకు రాజమౌళి తన భారీ మల్టిస్టారర్ మూవీ RRR పై స్పందించాడు… అమెరికా పర్యటన లో ఉన్న రాజమౌళి హార్వర్డ్ ఇండియా కాన్ఫరెన్స్ 2019లో పాల్గొన్నాడు. అక్కడ వారు అడిగిన ప్రశ్నలకు జవాబు చెబుతూ RRR గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.

“ఈ మూవీ బాహుబలికి ఏమాత్రం తీసిపోదు.. ఈ చిత్రం బాహుబలి లాంటి లార్జ్ స్కేల్ ఉన్న చిత్రమనీ.. ఇది కూడా పాన్ఇండియా మూవీ అంటూ చెప్పుకొచ్చారు”

ఇక తరువాత ఈ సినిమా గురించి ఎటువంటి ప్రశ్నలు వేయద్దని చెప్పేశారు.

ప్రస్తుతానికి ఈ చిత్రం రెండవ షెడ్యూల్ ని ప్రారంభించారు రాజమౌళి. కానీ ఇప్పటివరకు కూడా ఈ సినిమాలో హీరోయిన్లు ఖరారు కాలేదు. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నటువంటి ఈ చిత్రానికి సంబంధించిన వార్త రోజుకొకటి పుట్టుకొస్తూనే ఉంది. దుబాయ్ పర్యటన పూర్తి చేసుకున్న ఎన్టీఆర్ కూడా తొందరలో మళ్ళి ఈ సినిమా షూటింగ్లో పాల్గొననున్నాడు.

Tags : Rajamouli, RRR, Ram charan, Jr NTR

Write a comment ...
Post comment
Cancel