back

RRR రాంచరణ్ పాత్ర పేరు ఇదేనా ..?



Share via:

రాజమౌళి ఎ సమయంలో RRR సినిమా స్టార్ట్ చేసాడో కాని, ఈ సినిమా పైన లీకులు వస్తూనే ఉన్నాయి. రెండు రోజుల నుంచి సెట్ ఫోటోలతో నిండిపోయిన సోషల్ మీడియా లో ఇప్పుడు చరణ్ పాత్రకు సంబంధించిన మరో కీలకమైన అప్ డేట్ ఇప్పుడు బయటికి వచ్చింది. అది పాత్ర పేరు. విశ్వసనీయ సమాచారం మేరకు ఇందులో చరణ్ పేరు రామరాజు అని తెలిసింది. సౌండింగ్ చాలా పవర్ ఫుల్ గా ఉంది. 


స్వాతంత్ర సమరయోధుడు , మన్యం వీరుడు అయాన్ అల్లూరి సీతరామరాజు అసలు పేరు రామరాజుని తీసుకుని ఆ లక్షణాలు పాత్రలో ఉండేలా రాజమౌళి సెట్ చేసాడని టాక్. ఇది విన్న మెగా ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. మూడు ఆర్ లలో ఒక ఆర్ చరణ్ చేస్తున్న రామరాజు అని తెలిసిపోయింది. మరి రెండో ఆర్ తారక్ పేరు అయ్యుంటుంది. ఆ మూడో ఆర్ మాత్రం సస్పెన్స్. అయితే షూటింగ్ ప్రారంభంలో ఈ సినిమా టైటిల్ పైన వచ్చిన రామరావణ రాజ్యంతో ఇది కనెక్ట్ అవుతున్నట్టే అనిపిస్తోంది. ఇంకొద్ది రోజులు ఆగితే క్లారిటీ వచ్చేస్తుంది.

Tags : RRR, Ram charan, Rajamouli, Jr NTR

Write a comment ...
Post comment
Cancel