back

చిరంజీవి గారు నిజంగా గ్రేట్ - రోజా రమణి



Share via:

చిరంజీవి గారు నిజంగా గ్రేట్ - రోజా రమణి

50 సంవత్సరాల క్రితం దేశాన్ని ఊపేసిన భక్త ప్రహ్లాద సినిమాలో 5 ఏళ్ల ప్రహ్లాదుడిగా నటించి అందరి మన్ననలను పొందిన తర్వాత హీరోయిన్ గా సహాయ నటిగా 6 బాషలలో 150 చిత్రాలలో నటించిన “రోజా రమణి “ గారు పెళ్ళైన తర్వాత నటనకి స్వస్తి చెప్పి హీరోయిన్ లకు డబ్బింగ్ చెప్తూ వస్తున్నారు. ఇప్పటివరకు 450 సినిమాలకు డబ్బింగ్ చెప్పిన ఆవిడ మొన్న సోమవారం etv ఆలితో సరదాగా కార్యక్రమంలో పాల్గొని తన జీవిత విశేషాలను పంచుకుంది.

ఒక సంధర్బంలో చిరంజీవి గారి గురించి చెబుతూ ఆవిడా ఏమన్నారో ఆవిడ మాటల్లోనే...
“నా వందో సినిమా ‘పునాదిరాళ్లు’. అందులో చిరంజీవి నటించారు. నా పెళ్లికి ముందు ‘రక్తబంధం’ అనే సినిమాలో నటించా. అందులో చిరంజీవి నాకు బ్రదర్‌. మ్యారేజ్‌ ముందు నటించిన చివరి సినిమాలో, మ్యారేజ్‌ తర్వాత నటించిన ఏకైక చిత్రంలోనూ ఆయనే, ఇక తరుణ్‌ నటించిన ‘నువ్వేకావాలి’ 175 డేస్‌ ఫంక్షన్‌కి గెస్ట్‌ ఆయనే కావడం విశేషం. ఆయనలో ఓ గొప్ప గుణం ఉంది. పుట్టినరోజు, పెళ్లిరోజు, అవార్డు అందుకున్న రోజుల్లాంటివి ఉంటే ఫస్ట్‌ శుభాకాంక్షలు ఆయన నుంచే వస్తాయి. ఏదైనా బాధాకార ఘటనలు జరిగినా వచ్చి ఓదార్చే వ్యక్తి ఆయన. ఈ విషయంలో ఆయన నిజంగా గ్రేట్ ‌”.

రోజా రమణి గారి కొడుకే హీరో తరుణ్.

Tags : Roja Ramani About Chiranjeevi, Roja Ramani and Chiranjeevi, Mega Star

Write a comment ...
Post comment
Cancel