back

రికార్డ్స్ బద్దలు కొడుతున్న ఫిదా సాంగ్



Share via:

ఏ ముహూర్తాన మధుప్రియ ఫిదా లోని “వచ్చిందే” పాట పాడిందో ఆ పాట జోరు ఇప్పటికి కుడా తగ్గలేదు. బన్ని అంతటివాడే ఆ డ్యాన్సులకు పడిపోయానని కితాబిచ్చాడంటే అర్థం చేసుకోవాలి. పిల్లగాడు బిస్కెట్ వేసిండే! అంటూ సాయి పల్లవి వేసిన మెరుపు స్టెప్పులకు ప్రపంచవ్యాప్తంగా ఎందరో  ఫ్లాటైపోయారో. అందుకే  ఆ సాంగ్ జెట్ స్పీడ్ తో యూట్యూబ్ లో దూసుకుపోయింది. ఎంతగా అంటే.. ఇన్నాళ్లు రికార్డ్ బ్రేకింగ్ సాంగ్ అంటూ ధనుష్ ఆలపించిన `కొలవెరిడి...` గురించి తెగ చెప్పుకున్నాం. అనిరుధ్ ని ఓవర్ నైట్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ ని చేసిన ఆ పాట రికార్డుల్ని బ్రేక్ చేసే వేరొక సాంగ్ సౌత్లో రానేలేదు. ఇన్నాళ్టికి వరుణ్ తేజ్- సాయి పల్లవి జంటగా ఆడిపాడిన `వచ్చిందే` సాంగ్ ఆ రికార్డు ని బ్రేక్ చేసింది.


దాదాపు 174 మిలియన్ల వ్యూస్ 4లక్షల 19వేల లైక్ లు సాధించింది. అంతకుముందు ధనుష్ కొలవెరి డీ పాటకు 172 మిలియన్ వ్యూస్ వచ్చాయి.  కొలవెరిడి ఇన్నాళ్లు సౌత్ నంబర్- 1 యూట్యూబ్ సాంగ్ గా అలరించింది. ఇప్పటికి ఆ రికార్డును `ఫిదా` `వచ్చిందే..` సాంగ్ బ్రేక్ చేసింది. ఏడేళ్లలో కొలవెరిడి సాధించిన ఘనతను కేవలం ఏడాదిన్నర్రలోగానే బ్రేక్ చేసి ఫిదా సాంగ్ సంచలనం సృష్టించింది. శేఖర్ కమ్ముల- దిల్ రాజు కాంబినేషన్ లో వచ్చిన ఫిదా బాక్సాఫీస్ వద్దా సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే.

Tags : Varun Tej, Sai Pallavi, Vachinde Song, Fidaa

Write a comment ...
Post comment
Cancel