back

#RC12 అప్డేట్ : ఈ నెల 10తో టాకీ క్లోజ్



Share via:

ఆర్ సి 12 అనుకున్నట్టుగానే సంక్రాంతికే విడుదల అవుతుందని ఆ టైంలో ఎలాంటి మార్పు ఉండదని నిర్మాత డి.వి.వి.దానయ్య తేల్చి చెప్పాడు. నవంబర్ 10కంతా టాకీ పార్ట్ పూర్తి చేసి మిగిలిన రెండు పాటలను నెలాఖరుకు పూర్తి చేయబోతున్నారు. మరోవేపు డబ్బింగ్ ఒకరోజు ముందే అంటే 9నే మొదలుపెట్టే అవకాశాలు ఉన్నాయి. సంక్రాంతి సీజన్ చరణ్ కు బాగా కలిసి వచ్చింది. కెరీర్ లో బెస్ట్ మాస్ సినిమాలుగా నిలిచిన నాయక్-ఎవడు విడుదలై ఘన విజయాన్ని సొంతం చేసుకుంది సంక్రాంతికే.

అందుకే మాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రెస్ గా నిలిచిన బోయపాటి శీను సినిమా కూడా అదే సమయంలో రానుండటం ఫాన్స్ సెంటిమెంట్ గా కూడా ఫీలవుతున్నారు. కియారా అద్వాని హీరోయిన్ గా నటించిన ఈ మూవీలో చెర్రీ అన్నయ్యలుగా ఆర్యన్ రాజేష్ , తమిళ సీనియర్ హీరో ప్రశాంత్ కీలకమైన పాత్రలు చేస్తున్నారు. వివేక్ ఒబెరాయ్ విలన్గా చేస్తున్న ఈ సినిమా 2019 సంక్రాంతికి ఎన్.టీ.ఆర్. అండ్ F2 సినిమాలతో పోటి పడటం ఖాయం.

Tags : RC12 Update, Mega Power Star, Ram Charan, Boyapati Srinu, Kiara Advani

Write a comment ...
Post comment
Cancel