back

RC12 సంక్రాంతికే … ఇది పక్కా



Share via:

బోయపాటి శ్రీను దర్శకత్వంలో డి.వి.వి.దానయ్య నిర్మాణంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్నతన 12వ చిత్రం యొక్క టాకీ పార్ట్ షూటింగ్ నవంబర్ 10వ తేదిలోపు పూర్తి కానుంది. ఇంకా రెండు సాంగ్స్ షూట్ మాత్రమే బ్యాలెన్స్ వుంది. నవంబర్ 9నుండి ఈ చిత్రం యొక్క డబ్బింగ్ పనులు ప్రారంభం కానున్నాయి.

ఇక ఈ చిత్రం అనుకున్న సమయానికి విడుదల కాదని ఇటీవల వచ్చిన రూమర్లకు చెక్ పెట్టింది చిత్ర నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ . వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల ఖాయమని కొద్దీ సేపటి క్రితం అధికారకంగా ప్రకటించింది. అలాగే ఈ చిత్రం యొక్క ఫస్ట్ లుక్ మరియు టైటిల్ విడుదల తేదీని కూడా అతి త్వరలో ప్రకటిస్తామని తెలియజేసింది. అన్ని కుదిరితే ఈ చిత్రం యొక్క ఫస్ట్ లుక్ దీపావళి కి విడుదలయ్యే అవకాశాలు వున్నాయి.

Tags : Mega Power Star, Ram Charan, Boyapati Srinu, RC12, DVV Danayya, RC12 Movie Release Date

Write a comment ...
Post comment
Cancel