back

రాంచరణ్ సినిమా ఫస్ట్ లుక్ ఎప్పుడో తెలిసిపాయింది..!



Share via:

డి.వి.వి. దానయ్య నిర్మాణంలో మెగా పవర్ స్టార్ రాంచరణ్తో బోయపాటి శ్రీను తీస్తున్న సినిమా షూటింగ్ అజర్బైజాన్ లో జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు తెలుగు సినిమాలో చూపించని అజర్ బైజాన్ లోని అందమైన ప్రాంతాల్లో ఈ సినిమా షూటింగ్ కొద్ది రోజుల్లో పూర్తి కానుంది. ఇప్పటివరకు పేరు పెట్టని ఈ సినిమా టైటిల్ ని ఫస్ట్ లుక్ తో పాటు అక్టోబర్ 18న దసరా పండుగ సందర్బంగా రిలీజ్ చేయనున్నారు.

ఇప్పటికే సంక్రాంతి కి సినిమా విడుదల అంటూ ప్రకటించేసిన నిర్మాత, ఫస్ట్ లుక్ తో మొదలెట్టి వరుసగా ప్రమోషన్ కార్యక్రమాలు ప్లాన్ చేసారని వినవస్తుంది. దీపావళి కి టీజర్ రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నట్లు కూడా సినిమా యూనిట్ నుంచి వినిపిస్తుంది. మరి షూటింగ్ ఎంత వరకు వచ్చింది అనేది మాత్రం తెలియట్లేదు.

Tags : Mega Power Star Ram Charan, RC12 First Look Release Date, Boyapati Srinu, Kiara Advani

Write a comment ...
Post comment
Cancel